Delhi car horror: అంజలి స్నేహితురాలిపై విమర్శల వెల్లువ.. నువ్వేం స్నేహితురాలివి అన్న స్వాతి మాలివాల్

ఈ ఘటనలో అంజలిదే తప్పు అనేలా నిధి మాట్లాడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అంజలి స్నేహితురాలు నిధి ఆమెతోనే ఉంది. ఘటన జరిగిన తర్వాత అక్కడనుంచి తప్పించుకుని, ఇంటికి పారిపోయింది. ఆ సమయంలో పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అనిపించలేదా?

Delhi car horror: అంజలి స్నేహితురాలిపై విమర్శల వెల్లువ.. నువ్వేం స్నేహితురాలివి అన్న స్వాతి మాలివాల్

Delhi car horror: ఢిల్లీలో కారు అడుగు భాగంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన అంజలి స్నేహితురాలు నిధిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్నేహితురాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించాల్సింది పోయి, పారిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ ఘటనలో అంజలి తప్పు కూడా ఉందన్నట్లుగా నిధి మాట్లాడిన మాటలు కూడా నెటిజన్ల కోపానికి కారణమయ్యాయి.

Indian-Origin: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. కొండపై నుంచి కారు కింద పడగొట్టి భార్య, పిల్లల్ని చంపే యత్నం

తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివాల్ కూడా నిధి తీరుపై విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా, ఒక వీడియో ద్వారా అంజలి స్నేహితురాలు నిధిపై విమర్శలు చేశారు స్వాతి మాలివాల్. ఈ ఘటనలో సీసీ టీవీ ఫుటేజ్ బయటికొచ్చి, పోలీసులు సంప్రదించే వరకు అంజలి స్నేహితురాలు నిధి తనకేం పట్టనట్లే ఉండిపోయింది. సీసీ కెమెరా వీడియో బయటపడ్డ తర్వాత, పోలీసులు ఆమెను చేరుకున్న తర్వాత మాత్రమే ఆమె ఈ ఘటనపై స్పందించింది. దీనిపై కూడా స్వాతి మాలివాల్ నిధిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటిదాకా నిధి ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించింది.

Chennai: ట్రక్కు కింద పడి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. స్కూటీపై నుంచి గుంతలో పడటంతో దారుణం

‘‘ఈ ఘటనలో అంజలిదే తప్పు అనేలా నిధి మాట్లాడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అంజలి స్నేహితురాలు నిధి ఆమెతోనే ఉంది. ఘటన జరిగిన తర్వాత అక్కడనుంచి తప్పించుకుని, ఇంటికి పారిపోయింది. ఆ సమయంలో పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అనిపించలేదా? ఆమె కావాలనుకుంటే అంజలిని లాక్కెళ్లిన కారును ఫాలో అవుతూ వెళ్లొచ్చు. సహాయం కోసం ఏడ్చి ఉండాల్సింది. అంజలిని రక్షించేందుకు ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. దీని ద్వారా అంజలి ప్రాణాలతో బయటపడేదేమో! అసలు నిధి ఒక స్నేహితురాలేనా?’’ అని వీడియోలో స్వాతి మాలివాల్ వ్యాఖ్యానించింది.

ఈ ఘటనలో నిధి ఇచ్చిన స్టేట్‌మెంట్లు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగితేనే అసలు విషయం తెలుస్తుంది.