NRC ఏంటీ?..బీజేపీకి నితీష్ ఝలక్

  • Published By: venkaiahnaidu ,Published On : December 20, 2019 / 11:13 AM IST
NRC ఏంటీ?..బీజేపీకి నితీష్ ఝలక్

బీజేపీకి నితీష్ కుమార్ మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్డీయే కూటమికి బైబై చెప్పి లాలూతో చేతులు కలిపి మరోసారి బీహార్ సీఎం అయిన నితీష్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలకు ఆయన పరోక్ష సంకేతాలు ఆ వార్తలు నిజమేనని సృష్టం చేస్తున్నాయి.

పౌరసత్వ సవరణ చట్టం,ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న సమయంలో జేడీయూ అధినేత,బీహార్ సీఎం నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీని ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో ఎన్ఆర్సీ అమలుచేసే ప్రసక్తే లేదని ఆయన పరోక్షంగా వ్యాఖ్యనించారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్ఆర్సీ ఏంటీ?అంటూ ఎన్ఆర్సీ విషయంపై తన వైఖరిని పరోక్షంగా చెప్పారు. ఇటీవల జేడీయూ డిప్యూటీ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ…అసలు బీహార్ లో ఎన్ఆర్సీ అమలు ఉండబోదని నితీష్ కుమార్ హామీ ఇచ్చారని విలేఖరులతో చెప్పిన విషయం తెలిసిందే. 

మరో బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్ కూడా కూడా పౌరసత్వ సవరణ చట్టం,ఎన్ఆర్సీని బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మధ్యప్రదేశ్,పంజాబ్,చత్తీస్ ఘడ్,వెస్ట్ బెంగాల్,కేరళ రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టం,ఎన్ఆర్సీని అమలుచేయబోమని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. మొన్నటివరకు బీజేపీ మిత్రపక్షమైన శివసేన కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.