Supreme Court : 12వ తరగతి పరీక్షా ఫలితాలపై సుప్రీం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి.. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది.

Supreme Court : 12వ తరగతి పరీక్షా ఫలితాలపై సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court

Class 12th Results : దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి.. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని బోర్డులకు సూచించింది.

12వ తరగతి పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్ట్ 2021, జూన్ 24వ తేదీ గురువారం విచారణ జరిపింది. బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి వచ్చే నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలని కోర్టు స్పష్టం చేసింది.

అంతకుముందు సీబీఎస్‌ఈ (CBSE), సీఐఎస్‌సీఈ (CISCE) బోర్డులకు కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బోర్డులు కోర్టుకు తమ మూల్యాంక విధానాన్ని తెలియజేశాయి. జులై 31లోగా 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించాయి.