Corona : వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై చాలామందికి అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. స్పష్టమైన అవగాహన లేదు. మరి నిపుణులు ఏమంటున్నారు.

Corona : వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Corona Symptoms

Corona Symptoms : వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై చాలామందికి అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. స్పష్టమైన అవగాహన లేదు. మరి నిపుణులు ఏమంటున్నారు.

హోం ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* చక్కగా వెలుతురు, గాలి వచ్చే గదిలో కరోనా బాధితులను ఉంచాలి
* రోగులను చూసుకోవడానికి ఒక సహాయకుడు వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి
* 55ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండేవారు, క్యాన్సర్, ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధులు, రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారిని వేరే ఇంటికి పంపాలి
* కరోనా రోగులు ఎక్కువగా నీళ్లు తాగాలి
* గోరు వెచ్చని నీరు మంచిది
* ఇంటి నుంచి బయటకు వస్తే మాస్కు మస్ట్
* దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు టిష్యూ పేపర్ ఉపయోగించాలి
* కరోనా సోకిన వారు ఎట్టిపరిస్థితుల్లోనూ స్మోకింగ్ చేయకూడదు
* స్మోకింగ్ వల్ల శ్వాస కోశ వ్యవస్థ దెబ్బతినే అవకాశం

* కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే యాంటిజెన్ చేయించుకుంటే సరిపోతుంది
* ఒకవేళ దాంట్లో తేలనట్టు అనిపిస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి
* ఆర్టీపీసీఆర్ లో నెగిటివ్ వచ్చినా కొంతమందిలో లక్షణాలు ఉంటున్నాయి
* ఇలా లక్షణాలు ఉన్నవారు మాత్రమే డాక్టర్ సలహాతో సీటీ స్కాన్ చేయించుకోవాలి
* తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప సీటీ స్కాన్ జోలికి వెళ్లొద్దు
* సీటీ స్కాన్ లో రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం

* ఒక్క కరోనా రోగా ద్వారా 10 రోజుల్లో 140మందికి వైరస్ సోకే ప్రమాదం
* దీర్ఘకాలిక రోగాలతో బాధ పడేవారు వైరస్ బారిన పడితే జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహాతో ఆసుపత్రిలో చేరాలి
* లక్షణాలు లేని వారు, తక్కువ స్థాయిలో లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే పల్స్ ఆక్సిమీటర్ ద్వారా తమ ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవాలి
* ఆక్సిజన్ లెవెల్స్ 95కన్నా తక్కువ ఉంటే ఆసుపత్రిలో చేరాలి
* ఆస్తమా, శ్వాసకోశ సంబంధ సమస్యలున్న వారిలో ఆక్సిజన్ లెవెల్స్ 92శాతం వరకు ఉన్నా పర్లేదు
* 6 నిమిషాల నడక తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ చేక్ చేసుకోవాలి. 90 కన్నా తక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలి

* జ్వరం మూడు రోజుల కన్నా ఎక్కువ ఉంటే, విపరీతమైన బాడీ పెయిన్స్, బాగా డల్ గా ఉండటం, తలనొప్పిగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి
* జ్వరం వచ్చి ఒక్కరోజులో తగ్గిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
* వేరే వాళ్లకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
* 85 నుంచి 90శాతం మంది కరోనా రోగులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే లేదు

* కరోనా బారిన పడిన సమయంలోనూ రెగులర్ గా వాడే అన్ని మందులు వాడుకోవచ్చు
* కరోనా రోగులు మాంసం, కూరగాయలు తినొచ్చు
* కరోనా రోగులు వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు, పళ్ల రసాలు తీసుకోవాలి
* యాంటీ బయోటిక్స్ విరివిగా వాడటం మంచిది కాదు
* విటమిన్ మాత్రలు ఎక్కువగా వాడితే మరిన్ని సమస్యలు
* వైరస్ సోకిన వారు డాక్టర్లను సంప్రదించి మందులు వాడటం మంచిది. లేదంటే ప్రాణాంతకం కావొచ్చు
* హోం ఐసోలేషన్ లో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా మనోధైర్యం వీడొద్దు
* భయానికి లోనై వైరస్ కు బలాన్ని ఇవ్వొద్దు

* కరోనా అంటే కంగారు అక్కర్లేదు. కొంచెం క్రమశిక్షణ, మరికొంచెం జాగ్రత్తగా ఉంటే మహమ్మారిని మటాష్ చెయ్యడం పెద్ద విషయం కాదు
* పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రులకు పరుగులు తియ్యడం, ఆసుపత్రుల దోపిడీకి గురికావడం అనవరం
* ఏదో ఒకటి చేయడం కాదు..కొన్నిసార్లు ఏమీ చెయ్యకపోవడమే ఉత్తమం.
* అనవసరంగా ఆలోచన చేసి అవసరం లేకుండా పరీక్షలు చేయించుకుని బీపీ పెంచుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు