కరోనా కల్లోలం.. ఇండియాలో సెకండ్ లాక్‌డౌన్ విధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

  • Published By: naveen ,Published On : November 6, 2020 / 04:57 PM IST
కరోనా కల్లోలం.. ఇండియాలో సెకండ్ లాక్‌డౌన్ విధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

second corona lockdown in india: కరోనా వైరస్ కేసులు మన దేశంలో భారీ సంఖ్యకి చేరకముందే లాక్‌ డౌన్ విధించాం. కానీ ఇప్పుడు మాత్రం అంతకి మించి కేసులు నమోదవుతున్నా.. అన్‌లాక్ చేస్తున్నాం..ఎందుకంటే..మన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. కానీ అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఎవరికి వారే ఇళ్లలో కూర్చోవాల్సి రావచ్చు. మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

చలి వాతావరణంలో మరింత ప్రమాదకరంగా మారనున్న వైరస్:
సెకండ్ వేవ్ సెకండ్ లాక్‌డౌన్.. ఫ్రాన్స్, యూకేలో ఇదే సిచ్యుయేషన్.. మరి విదేశాల్లో పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనమేం చేయాలి… ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖానికి మాస్క్ పెట్టుకోవాల్సిందే.. ఒకరికి ఒకరు కనీస దూరం పాటించాల్సిందే.. ఓ రకంగా న్యూనార్మల్ ‌కి అలవాటు పడాల్సిందే.. కనీసం కరోనాకి వ్యాక్సిన్ వచ్చేంతవరకైనా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే, ఇప్పటిదాకా చూసిన వైరస్ వేరు..చలి వాతావరణంలో వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారితే.. ప్రాణాంతకంగా మారొచ్చు. అందుకే ఈ మూడు నెలలూ తప్పనిసరిగా సురక్షిత విధానాలు ఫాలో అవ్వాల్సిందే.

వాటిలాగా ఇండియా రిచ్ కంట్రీ కాదు:
ఫ్రాన్స్, యూకేలో మొదటి విడత లాక్‌డౌన్‌తోనే ఆర్ధిక వ్యవస్థలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనం అయ్యాయ్. ఫ్రాన్స్ లో మొదటి విడత లాక్‌డౌన్‌లో 120 బిలియన్ యూరోలు నష్టపోయింది.. బ్రిటన్‌లోనూ 210 బిలియన్ యూరోలు నష్టపోయింది. రెండో విడత లాక్‌డౌన్‌తో 100 బిలియన్ యూరోలు నష్టపోతుందని అంచనా. ఇది ఆర్థికంగా కలిగే నష్టమైతే.. కరోనా చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తుంది.. ఉపాధి కోల్పోయేలా చేస్తుంది.. ఐతే ప్రాణాల కంటే ఇదేం ఎక్కువ కాదనే ఒక్క కాన్సెప్ట్‌తో మాత్రమే ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయ్.. ఐతే అవన్నీ ధనిక దేశాలు.. కాబట్టి అక్కడి జనాలకు భారీగా స్టిమ్యులస్ ప్యాకేజీలు అమలు చేయగలవ్.. డైరక్ట్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు చేయగలవ్.

కోట్లమందిని రోజుల తరబడి ఇళ్లకే పరిమితం చేసి ఆర్థిక సాయం చేయడం కుదరదు:
ఇలాంటి స్థితిలో మరి మన దేశం పరిస్థితేంటనే ఆలోచన రాకమానదు.. మనది అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే, కోట్లమందిని రోజుల తరబడి ఇళ్లకే పరిమితం చేసి ఆర్థిక సాయం చేయడం కుదరదు.. దానికి తోడు రోజులకు తరబడి లాక్‌డౌన్‌తో జనం విసిగిపోతారు. దానికి తోడు ఆర్థికంగా పతనం అవుతారు కాబట్టే అన్‌లాక్ చేసారు. మార్చి నెలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో చాలావరకూ వైరస్‌పై అవగాహన వచ్చింది. దాంతో ఎలా పోరాడాలో.. వైరస్ మన జోలికి రాకుండా ఎలా బతకాలో కూడా తెలిసింది.. కాబట్టే మరణాల శాతం తగ్గిపోయింది.. ఐతే ఇప్పుడిప్పుడే మళ్లీ వైరస్ కేసులు పెరగడం ప్రారంభమైంది.