Shraddha Murder Case: శ్రద్ధా చివరి ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో ఏముంది..? పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు ..

నిందితుడు ఆప్తాబ్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. ఇప్పటికే శ్రద్ధ శరీరభాగాల్లో కొన్నింటిని గుర్తించిన పోలీసులు.. ఆమె ఫోన్ చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆమె చివరి ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.

Shraddha Murder Case: శ్రద్ధా చివరి ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో ఏముంది..? పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు ..

Shraddha Case

Shraddha Murder Case: ఢిల్లీలో దారుణ హత్యకుగురైన శ్రద్ధా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ పూనావాలా శ్రద్ధాను దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని 35ముక్కలుగా చేసి ఓ అద్దె ప్లాట్‌లోని ఫ్రిజ్‌లోఉంచి రోజుకో భాగాన్ని సమీప అడవిలో పడేస్తూ వచ్చాడు. ఈ ఘటన జరిగిన ఆరు నెలల తరువాత (నవంబర్ 12న) ఢిల్లీ పోలీసులు నిందితుడు ఆప్తాబ్‌ను అరెస్టు చేశారు.

Shraddha Murder Case: శ్రద్ధాను హత్యచేసింది నేనే.. ఇప్పుడు ఆ విషయాలేవీ నాకు గుర్తుకురావడం లేదు.. కోర్టులో నిందితుడు

నిందితుడు ఆప్తాబ్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. ఇప్పటికే శ్రద్ధ శరీరభాగాల్లో కొన్నింటిని గుర్తించిన పోలీసులు.. ఆమె ఫోన్ చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆమె చివరి ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా‌వాకర్ తన చివరి ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో తన స్నేహితుడు కరణ్‌కు కొన్ని విషయాలు పంచుకోవాలని సందేశం పంపించింది. ప్రస్తుతం నేను పనిలో ఉన్నానని కరణ్ తెలిపాడు. శ్రద్ధా నుంచి ఈ సందేశం తర్వాత కరణ్ మళ్లీ మే18న నీ వద్ద ఏ విషయం ఉంది అని మెస్సేజ్ పెట్టాడు. ఎలాంటి రిప్లైరాకపోవడంతో.. సెప్టెంబర్ 24న శ్రద్ధా నువ్వు క్షేమంగా ఉన్నావా అంటూ కరణ్ మళ్లీ ఆరాతీశాడు.

Shraddha Murder Case: ఆరోజు రాత్రంత్రా శ్రద్ధా శవం పక్కనే గంజాయి సిగరేట్లు తాగిన ఆఫ్తాబ్.. పోలీసుల విచారణలో వెలుగులోకి కిల్లర్ ఘోరాలు ..

అయితే, ఈ సందేశం చదివినట్లు చూపినప్పటికీ కరణ్‌కు ఎలాంటి రిప్లై రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రద్దా మొబైల్ నుండి ఆప్తాబ్ ఇన్ స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇన్ స్టాగ్రామ్‌లో శ్రద్ధా బతికేఉన్నట్లు స్నేహితులతో ఆప్తాబ్ మాట్లాడుతుండేవాడని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో శ్రద్దాను హత్యచేసిన కత్తిని గురుగ్రామ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్-3 అటవీ ప్రాంతంలో కనుగొన్నారు. ఇంకా శ్రద్ధ తల, ఇతర శరీర భాగాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది.