దేశం కోసం ఏం చేశారని…మోడీ బయోపిక్ ఎందుకు చూడాలి

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2019 / 01:18 PM IST
దేశం కోసం ఏం చేశారని…మోడీ బయోపిక్ ఎందుకు చూడాలి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.గురువారం(ఏప్రిల్-4,2019) వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడుతూ… దేశం కోసం ఏం చేశారని మోడీ సినిమాను ప్రజలు చూడాలంటూ సూటిగా ప్రశ్నించారు. మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ…ఎందుకు ప్రజలు మీ సినిమా చూడాలి? ఒకవేళ ప్రజలకు సినిమాలు చూడాలనిపిస్తే గాంధీజీ, అంబేడ్కర్‌ జీ వంటి వాళ్ల సినిమాలు చూస్తారు. మోడీ సినిమా ఎందుకు చూస్తారు అని మమత ప్రశ్నించారు.మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని విసిరేస్తారని,ప్రజాస్వామ్య దేశాన్ని నిరంకుశ పాలనగా మార్చేస్తారని అన్నారు.

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో ప్రధాని మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కిన  సినిమా ‘పీఎం నరేంద్ర మోడీ’ ఈ నెల 12న విడుదల కావాల్సిఉంది. అయితే ఎన్నికల తరుణంలో ఈ సినిమా విడుదల చేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేననంటూ నియమావళిని ఉల్లంఘించడమననీ సినిమా విడుదలను ఆపాలని కాంగ్రెస్, వామపక్షాలు ఎలక్షన్ కమిషన్ ను కోరాయి.

బుధవారం కూడా మోడీ మమత ల మాటల యుద్ధం జరిగింది.బుధవారం వెస్ట్ బెంగాల్ పర్యటించిన మోడీ మమతను స్పీడ్ బ్రేకర్ దీదీగా అభివర్ణించగా…ఎక్స్ పైరీ బాబు అంటూ మోడీపై మమత సెటైర్లు వేశారు.