Sexual Harassments IN Indian Sports: భారత క్రీడారంగంలో వేళ్లూనుకుపోయిన లైంగిక వేధింపులు? అయినా చర్యలు తీసుకోని దుస్థితి..క్రీడా స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిన పరిస్థితి

భారత క్రీడారంగంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో క్రీడాకారులు ధర్నా చేపట్టేవదరకు వెళ్లింది. భారత్ క్రీడారంగంలో ఇటువంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. ఓ మహిళా కోచ్ హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ తనను లైంగిక వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గతంలోనూ ఇండియన్ స్పోర్ట్స్‌ని కుదిపేసిన షాకింగ్ అలిగేషన్స్ చాలానే ఉన్నాయ్.

Sexual Harassments IN Indian Sports: భారత క్రీడారంగంలో వేళ్లూనుకుపోయిన లైంగిక వేధింపులు? అయినా చర్యలు తీసుకోని దుస్థితి..క్రీడా స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిన పరిస్థితి

Sexual Harassments In Indian Sports (1)

Sexual Harass Indian Sports: భారత క్రీడారంగంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో క్రీడాకారులు ధర్నా చేపట్టేవదరకు వెళ్లింది. భారత్ క్రీడారంగంలో ఇటువంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. ఓ మహిళా కోచ్ హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ తనను లైంగిక వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గతంలోనూ ఇండియన్ స్పోర్ట్స్‌ని కుదిపేసిన షాకింగ్ అలిగేషన్స్ చాలానే ఉన్నాయ్.ఇన్నేళ్లుగా ఈ దరిద్రపు కల్చర్ క్రీడా వ్యవస్థలో నాటుకుపోయినా.. ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు.నోరు మెదరపలేదు. ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటిదాకా ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఎంతమందిపై వేటు వేశారు? అంటే చెప్పలేని పరస్థితి. కాదుకాదు దుస్థితి.

దేశంలో స్పోర్ట్స్‌ని కెరీర్‌గా భావించి వచ్చే వాళ్లకు ఇదొక శాపంలా తయారైంది. ఇటువంటి వేధింపులకు గురయ్యేవారు ఎక్కువగా రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే కావటం గమనించాల్సిన విషయం. ఆటల మీదున్న ప్రేమతో.. అన్నీ వదులుకొని..ఏదో సాధించాలని వచ్చేవారికి ఈ వేధింపులు దిక్కుతోచకుండా చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా వేదికలపై.. త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలన్న కసితో ఆడేవారికి ఈ దరిద్రపు వేధింపులు మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఓ పూట తిండి తినకపోయినా సరే.. ఆట కోసం ప్రాణం పెట్టేవారు.. ఎన్నో కష్టాలకోర్చి.. ఇక్కడిదాకా వచ్చినవారి ఆశలను.. తమ లైంగిక ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నారు కొంతమంది. ఇండియన్ స్పోర్ట్స్‌ సిస్టమ్‌లో ఎంతటి కుళ్లు దాగుందో.. ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్నాయో.. తెలియాలంటే.. గడిచిన కొన్నేళ్లలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. గతేడాది జులైలో.. అండర్-17 విమెన్స్ ఫుట్‌బాల్ టీమ్ అసిస్టెంట్ కోచ్ అలెక్స్ ఆంబ్రోస్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయ్. యూరప్ టూర్‌లో.. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలతో ఆయన్ని తొలగించారు. అయితే.. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో కంప్లైంట్ చేసిన తర్వాత.. ఫుట్ బాల్ సంస్థ ఇటీవలే ఆంబ్రోస్‌ని మళ్లీ కోచ్‌గా తిరిగి తీసుకొచ్చింది.

Sexual Harassments In Indian Sports: భారత క్రీడారంగాన్ని కుదిపేస్తున్న లైంగిక ఆరోపణలు.. వేధింపుల వల్లే టాలెంటెడ్ ప్లేయర్లు రాణించలేకపోతున్నారా?

గతేడాది జూన్‌లో స్లోవేనియాలో జరిగిన ఓవర్సీస్ ట్రైనింగ్ క్యాంపులో తనతో అనుచితంగా ప్రవర్తించారని.. నేషనల్ టీమ్ చీఫ్ కోచ్ ఆర్కే శర్మపై ఓ రోమన్ మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు చేశారు. తమిళనాడులో ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచ్ పి.నాగరాజన్‌పై.. అక్కడి మహిళా అథ్లెట్లు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. 2021 జులైలో 19 ఏళ్ల అథ్లెట్ నాగరాజన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీని తర్వాత.. మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కోచ్ నాగరాజన్‌.. తమతో కొన్నేళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తించారని కంప్లైంట్ చేశారు. దీనిని బట్టి.. పరిస్థితులు ఎలా దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2020 జనవరిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో.. ఓ మహిళా క్రికెటర్‌పై ఆమె కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారణనే ఆరోపణలపై.. స్థానిక పోలీసులు కేసు బుక్ చేశారు.

2014లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో.. ఓ మహిళా జిమ్నాస్ట్‌పై ఆమె కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ ఫైల్ అయింది. 2011 మార్చిలో తమిళనాడు అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీపై.. లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, నేరపూరిత బెదిరింపు ఆరోపణలు వచ్చాయి. నేషనల్ లెవెల్ ఈవెంట్‌లకు సెలక్ట్ చేసేందుకు.. సెక్సువల్ ఫేవర్ కోరుతున్నాడని ఓ మహిళా బాక్సర్ ఆరోపించింది. 2010లో భారత మహిళల హకీ టీమ్ కోచ్‌ మహరాజ్ కిషన్ కౌశిక్‌పైనా ఈ విధమైన ఆరోపణలు వచ్చాయి. 2009లో టీమ్‌లో చేర్చుకోవడం కోసం లైంగికపరమైన ప్రయోజనాలను అడిగారని.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిపైనా ఆరోపణలు వచ్చాయి.

క్రీడల్లో.. ఈ విధమైన ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు.. వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిమీదే ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అయితే.. సమాచార హక్కు చట్టం డేటా ప్రకారం.. 2010 నుంచి 2020 మధ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు.. లైంగిక వేధింపులకు సంబంధించి 45 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో.. 29 కంప్లైంట్లు కోచ్‌లకు వ్యతిరేకంగా వచ్చినవే ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితులపై.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ఊరికే అలా వదిలేశారు. కొందరికి.. జీతాల్లో, పెన్షన్‌లో కొంతమేర కోత విధించారు. ఇంకొందరిని ట్రాన్స్‌ఫర్లు చేసి ఊరుకున్నారు. కొన్ని కేసులైతే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అవి.. పరిష్కారమవుతాయన్న నమ్మకం కూడా లేదు.

Wrestler protest: రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్.. IOAని ఆశ్రయించిన రెజ్లర్లు

2021లో జర్మనీలో.. క్రీడల్లో ఈ విధమైన వేధింపులు, ఆరోపణలు.. పోల్ సమస్యగా మారింది. దాంతో.. అక్కడి ఫెడరల్ పార్లమెంట్ స్పోర్ట్స్ కమిటీ.. క్రీడల్లో భావోద్వేగ, శారీరక, లైంగిక హింసపై.. బహిరంగ విచారణ నిర్వహించింది. ఇప్పుడు.. ఇండియాలోనూ ఈ సమస్యపై చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రెజ్లర్లు రోడ్డెక్కారు.. మిగిలిన క్రీడాకారులు రోడ్డెక్కక ముందే.. ఈ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే దేశం పరువు అంతర్జాతీయంగా పోయే ప్రమాదం ఉంది. అంతలోపే.. ఈ పరిస్థితులు మారాలంటే.. కచ్చితంగా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.