తీహార్ జైలులో లాఠీ దెబ్బలు తిన్న నోబెల్ విజేత అభిజిత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2019 / 09:32 AM IST
తీహార్ జైలులో లాఠీ దెబ్బలు తిన్న నోబెల్ విజేత అభిజిత్

ఆర్థికశాస్త్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు  సోమవారం స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విసయం తెలిసిందే. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు గాను వీరికి ఈ పురస్కారం ఆయనకు దక్కింది.

అయితే అభిజిత్ గురించిన ఓ ఆశక్తికరమైన అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హత్యాయత్నం కేసులో ఆయన 12రోజులు తీహార్ జైలులో ఊచలు లెక్కపెట్టాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. 1983లో అభిజిత్ జేఎన్ యూ విద్యార్థిగా ఉన్న సమయంలో  ఈ సంఘటన జరిగింది. 

1983లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ను కాలేజీ నుంచి బహిష్కరించారు. అయితే ఆ నిర్ణయం ఉపసంహరించుకోవాలపి డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్ ను ఆయన ఇంట్లో అడ్డగించినందుకు  మరికొందరు జేఎన్ యూ విద్యార్థులతో సహా అభిజిత్ ను కూడా పోలీసులు తీహార్ జైలుకి తరలించారు.తీహార్ జైలలో పోలీసులు తనను బాగా కొట్టారని ఓ ఇంటర్వ్యూలో అభిజిత్ తెలిపారు. తనపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్లు పోలీసులు బుక్ చేశారని ఆయన తెలిపారు. 10రోజుల తర్వాత తమపై పెట్టిన సెక్షన్లు ఉపసంహరించబడటంతో తీహార్ జైలు నుంచి బయటపడ్డామని అభిజిత్ తెలిపారు.

58 ఏళ్ల బెనర్జీ కోల్ కతా ప్రెసిడెన్సీ యూనివర్శిటీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 1988లో పీహెచ్‌డీ పట్టా పొందారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన అభిజిత్ బెనర్జీ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో  ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2015లో అభివృద్ధి అజెండా తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఉన్నతస్థాయి ప్రముఖ వ్యక్తుల ప్యానెల్లో అభిజిత్ సభ్యులుగా ఉన్నారు.