Schools Reopen: భారత్‌లో స్కూళ్లు ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయి? ప్రభుత్వం సమాధానాలు!

కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

Schools Reopen: భారత్‌లో స్కూళ్లు ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయి? ప్రభుత్వం సమాధానాలు!

Schools Reopen

Indian Schools: కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిలో కోవిడ్-19 మహమ్మారి మధ్య జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డు పరీక్షలు రద్దవగా.. దేశంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందరికీ టీకాలు వేసిన తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవడం గురించి ఆలోచిస్తామని కేంద్రం స్పష్టంచేసింది. విదేశాలలో పాఠశాలలు తిరిగి ప్రారంభించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో కూడా పరిశీలిస్తున్నట్లు కేంద్రం చెబుతుంది.

కరోనా వ్యాప్తి చెందిన తరువాత స్కూళ్లు మూసివేయగా.. విద్యార్థులు, ఉపాధ్యాయులను సేఫ్ జోన్‌లోకి తీసుకుని వచ్చిన తర్వాతే, స్కూళ్లు తీసే ఆలోచనలో ఉన్నామని నీతి ఆయోగ్(ఆరోగ్య) సభ్యుడు వికే పాల్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహమ్మారి మనకు హాని కలిగించదు అనే విశ్వాసం మనకు ఉంటే తప్ప, స్కూళ్లు ప్రారంభించవచ్చు” అని రాష్ట్రాలకు చెప్పమని డాక్టర్ పాల్ అన్నారు.

“మూడవ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుంది అనేదానిపై ఇంకా శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు రాలేదని, ఒకవేళ మూడవ వేవ్ వచ్చినా ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై చర్చలు సాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. పాఠశాలలను తిరిగి తెరవాలంటే, విద్యార్థుల గురించి మాత్రమే కాదు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి మాత్రమే కాదు.. చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. వైరస్ రూపాన్ని మార్చుకుంటే, అది పిల్లల్లో ప్రమాదం అవుతుంది.” అని డాక్టర్ పాల్ చెప్పారు.

డబ్ల్యూహెచ్‌ఓ-ఎయిమ్స్ సర్వే ప్రకారం, 18 ఏళ్లలోపు వయస్సు గల కోవిడ్ -19 సెరోప్రెవలెన్స్ 55.7 శాతం, 18 ఏళ్లు పైబడిన వారు 63.5 శాతం. కాగా, గణనీయమైన శాతంలో చాలామంది పిల్లలు ఇప్పటికే తెలియకుండానే వ్యాధి బారిన పడ్డారని మరియు కొంతమంది చికిత్స తర్వాత కోలుకున్నట్లుగా చెబుతున్నారు అధికారులు. గత సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఫస్ట్ వేవ్ ఉండగా.. కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ క్లాసులను, మరికొన్ని రాష్ట్రాలు ఫిజికల్ క్లాసులను తిరిగి ప్రారంభించాయి. కానీ సెకండ్ వేవ్ కారణంగా అన్నీ రాష్ట్రాలు కూడా ఆన్‌లైన్ మోడ్‌కు మారాయి. మహమ్మారి కారణంగా అన్నీ రాష్ట్రాలు వార్షిక పరీక్షలను కూడా రద్దు చేశాయి. దేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డు పరీక్షలు కూడా రద్దయ్యాయి.

దేశంలో సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించగా.. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, సెకండ్ వేవ్ తగ్గినా కూడా మహమ్మారి మాత్రం ముగియలేదని ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. పిల్లలు కోవిడ్ -19 సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం సంసిద్ధతగా ఉందని చెప్పారు.