Covid Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత కరోనా బారిన పడితే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్ప‌టికీ వ్యాక్సిన్ల విష‌యంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత వైర‌స్ బారిన ప‌డితే ఎలా అన్న ప్ర‌శ్న చాలా మందిని వేధిస్తోంది. సెకండ్ డోసు ఎప్పుడు తీసుకోవాలి?

Covid Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత కరోనా బారిన పడితే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

Covid Vaccine

Covid Vaccine : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్. అవును.. మహమ్మారిని ఖతం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే దారి అని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. మన దేశంలో తొలుత క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి చాలా మంది వెనుకాడారు. సైడ్ ఎఫెక్ట్స్‌కు భ‌య‌ప‌డి వేసుకోలేదు. కానీ, కరోనా సమస్యకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని ప్రభుత్వాలు, డాక్టర్లు చెప్పడంతో, అవగాహన కల్పించడంతో ప్రజల్లో మార్పు వచ్చింది. టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.

ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్ప‌టికీ వ్యాక్సిన్ల విష‌యంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత వైర‌స్ బారిన ప‌డితే ఎలా? సెకండ్ డోసు ఎప్పుడు తీసుకోవాలి? అన్న ప్ర‌శ్న చాలా మందిని వేధిస్తోంది. దానికి డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారంటే..

సాధార‌ణంగా కొవాగ్జిన్ అయితే తొలి డోసు త‌ర్వాత నాలుగు వారాల‌కు రెండో డోసు వేసుకోవాలి. అదే కొవిషీల్డ్ అయితే 6-8 వారాల మ‌ధ్య తీసుకోవ‌చ్చు. కానీ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత క‌రోనా వస్తే.. ఇలా చేయ‌డం కుద‌ర‌దు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న త‌ర్వాత 2-4 వారాల మ‌ధ్యే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇక ఈ మ‌ధ్యే కొవిడ్ బారిన ప‌డి కోలుకున్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవాలంటే క‌నీసం 1 నుంచి 3 నెలలు ఆగాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్లు వేసుకునే వాళ్లు ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సి ముఖ్య‌మైన విషయం ఏమిటంటే.. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత వైర‌స్ దాడి చేయ‌ద‌ని కాదు. కానీ ఈ వ్యాక్సిన్లు కొవిడ్ తీవ్ర‌త‌ను త‌గ్గిస్తాయి. మ‌రీ తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు లేకుండా, ఆసుప‌త్రి అవ‌స‌రం రాకుండా చేయ‌డంలో వ్యాక్సిన్లు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న త‌ర్వాత కూడా క‌రోనా బారిన ప‌డితే.. ప్ర‌స్తుతానికి మ‌ళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఇక క‌రోనా ఉన్నా ల‌క్ష‌ణాలు లేని వ్య‌క్తి వ్యాక్సిన్ తీసుకుంటే ఏమ‌వుతుందో అన్న భ‌యం కూడా కొంత మందిలో ఉంది. కానీ అలాంటి వాళ్లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఇది ఎలాంటి దుష్ప్ర‌భావాల‌నూ చూప‌ద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. స‌హజంగానే కొంద‌రిలో వైర‌స్‌ను ఎదురించే స్థాయిలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయి. మ‌రికొంద‌రిలో వ్యాక్సిన్ ఆ ప‌ని చేస్తుంది. ఇక స‌హ‌జంగా ఉత్పన్న‌మ‌య్యే యాంటీ బాడీల కంటే వ్యాక్సిన్ల వ‌ల్ల
వ‌చ్చేవి ఎక్కువ కాలం ఉంటాయి.