Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..

అగ్నిపథ్ పథకంలో నియామకాలకు తొలి అడుగు పడింది. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు.

Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..

India Air Force

Agnipath: ఆర్మీలో సేవలు అందించాలని భావించే యువతకు ‘అగ్నిపథ్’ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద నాలుగేళ్ల పాటు ఆర్మీలోని వివిధ విభాగాల్లో పనిచేయొచ్చు. ఆర్మీ రెగ్యూలర్ రిక్రూట్ మెంట్ విధివిధానాల ప్రకారమే నియామకాలు ఉంటాయి. నాలుగేళ్ల కాలం పూర్తయిన తరువాత ఆర్మీ నుంచి బయటకు వచ్చి వారికి నచ్చిన పనిని చేసుకోచ్చు. ఈ నాలుగేళ్లలో మొదటి ఏడాది రూ. 4.67లక్షల ప్యాకేజీతో జీతం ప్రారంభం అయి నాలుగో ఏడాది రూ. 6.92లక్షలకు చేరుతుంది. దీంతో నాలుగేళ్ల తరువాత రిటైర్మెంట్ సేవానిధి కింద ఒక్కొక్కరికి రూ.11.71 లక్షల ప్యాకేజీ రానుంది. దీనికితోడు విధి నిర్వహణ సమయంలో రూ. 48లక్షల బీమా కవరేజీని కేంద్రం అందించనుంది.

Agnipath: ‘అగ్నిపథ్’ నిరసనలపై బండి సంజయ్ ఎమన్నారంటే..

అయితే అగ్నిపథ్ పథకం కాల పరిమితి నాలుగేళ్లు కావటంతో యువత ఆందోళనలకు దిగుతున్నారు. రెగ్యూలర్ నియామకాలు చేపట్టాలని, నాలుగేళ్ల తరువాత బయటకు వచ్చి మేము ఏం చేయాలంటూ యువత ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లో పలు రైళ్లకు ఆందోళన కారులు నిప్పంటించారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు స్టేషన్ లోకి వచ్చి రైళ్లకు నిప్పంటించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందాడు.

Minister Kishan Reddy: ’అగ్నిపథ్‌‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..

దేశవ్యాప్తంగా అగ్ని పథ్ పథకంపై ఆందోళనలు మిన్నంటుతున్న క్రమంలో .. అగ్నిపథ్ పథకంలో నియామకాలకు తొలి అడుగు పడింది. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిందని తెలిపారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టనందున అగ్నిపథ్ తొలి రిక్రూట్ మెంట్ కు గరిష్ఠ వయో పరిమితిని 23ఏళ్లకు పెంచడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తున్నామని వీఆర్ చౌదరి స్పష్టం చేశారు. మరోవైపు ఆర్మీలోనూ అగ్నిపథ్ నియామకాలు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.