నాకు బాధగా ఉంది.. మనమెప్పుడు మేల్కొంటాం: సొంత పార్టీపై కపిల్ సిబాల్ కామెంట్స్

  • Published By: vamsi ,Published On : July 13, 2020 / 06:57 AM IST
నాకు బాధగా ఉంది.. మనమెప్పుడు మేల్కొంటాం: సొంత పార్టీపై కపిల్ సిబాల్ కామెంట్స్

రాజస్థాన్‌లో మరోసారి రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాజస్థాన్‌కు చెందిన అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్ ఇవాళ(13 జులై 2020) ఒక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు సరిగ్గా లేవని ఆ పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల, మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా రాజకీయ సంక్షోభం కనిపిస్తుంది. ఈ సంక్షోభం దృష్ట్యా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ చేసిన ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

“నా పార్టీ గురించి నేను ఆందోళనగా ఉన్నాను” అని సిబల్ ట్వీట్‌లో రాశారు. గుర్రాలు మన దగ్గర నుంచి పారిపోయినప్పుడు మాత్రమే మనం మేల్కొంటామా? పార్టీ సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోకపోతే పార్టీకి భారీ నష్టాలు ఎదురవుతాయని ఆయన పార్టీ హైకమాండ్‌కు సందేశం పంపినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది.

రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని దించాలని సచిన్ పైలెట్ భావిస్తున్నారు. సచిన్ పైలట్ 15 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరుకున్నారు. పైలట్‌తో వచ్చిన ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్‌కు చెందినవారు, ముగ్గురు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన స్వతంత్రులు.

Read Here>>సచిన్ పైలట్ కు షాక్ : జైపూర్ కు 3 MLAలు…ట్రబుల్ షూటర్స్ ని రాజస్థాన్ పంపిన కాంగ్రెస్ హైకమాండ్