Ukraine Tension: అమెరికా – ఉక్రెయిన్ – రష్యాల మధ్య భారత్ ఎక్కడ?

ఉక్రెయిన్ వ్యవహారంలో అటు అమెరికా, ఇటు రష్యాల మధ్య భారత్ ఎటువంటి పాత్ర పోషిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

Ukraine Tension: అమెరికా – ఉక్రెయిన్ – రష్యాల మధ్య భారత్ ఎక్కడ?

Ukraine

Ukraine Tension: ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా అమెరికా మధ్య.. పరస్పర మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాలు యుద్ధానికి దిగొచ్చన్న సంకేతాలు.. యూరోప్ సహా ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఉక్రెయిన్ లోకి రష్యా బలగాలు ప్రవేశిస్తే యుద్ధం తధ్యం అంటూ అమెరికా ప్రకటించగా..రష్యా అందుకు ప్రతిగా సిద్ధంగా ఉన్నామంటూ బదులివ్వడం మరింత ఉద్రిక్తతకు తావిచ్చింది. ఈక్రమంలో అటు అమెరికా, ఇటు రష్యాల మధ్య భారత్ ఎటువంటి పాత్ర పోషిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. రెండు అగ్ర దేశాలకు మిత్రపక్షంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఎవరి పక్షాన నిలవాలో తెలియక.. మిన్నకుండి పోయింది.

Also read: Bandi Sanjay: సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసుల సమక్షంలోనే మాపై దాడులు: బండి సంజయ్

అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో చైనా, పాక్ మినహా.. అన్ని వేళల అందరి బాగు కోరింది భారత్. అటు రష్యాతో ఎప్పటి నుంచో మంచి భాగస్వామిగా కొనసాగుతున్న భారత్.. ఆ దేశం నుంచి ఆయుధాలు, మిస్సైల్స్ ఇతర రక్షణ సంబంధిత సాంకేతికతను కొనుగోలు చేస్తుంది. ఇక అమెరికాతో వ్యూహాత్మక పట్టుబడులు, ఐటీ ఎగుమతులు, ఇతర మానవ వనరుల సంబంధాలు భారత్ కు అమెరికాను మరింత దగ్గర చేసాయి. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలను నిశ్చితంగా పరిశీలిస్తున్న భారత విదేశాంగశాఖ.. ఆ రెండు దేశాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని హితవు పలికింది. యుద్ధం వస్తే ఎవరి పక్షాన నిలబడాలి అనే విషయం కన్నా, యుద్ధాన్ని ఆపే శక్తీ భారత్ కు ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు బలం చేకూర్చుతూ.. రష్యా – అమెరికా దౌత్యాధికారులకు స్నేహపూర్వక సందేశాన్ని చేరవేసింది భారత్. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ కోసం యుద్ధం చేయబోమని రష్యా విదేశాంగ మంత్రి శుక్రవారం ప్రకటించడం.. కాస్తోకూస్తో.. భారత్ ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. ఒక వేళ అమెరికా – రష్యాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయినా.. ఆ రెండు దేశాలతో మన విదేశాంగ విధానం పాడవకుండా సున్నితంగా వ్యవహరిస్తోంది భారత్.

Also read: Train Tracks Flames: అమెరికాలో రైలు పట్టాలపై చలిమంటలు, ఎందుకో తెలుసా?

నాటో దళాలు ఉక్రెయిన్ కు చేరుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ ముందు జాగ్రత్త చర్యగా కీవ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు, విద్యార్థులు.. తమ వివరాలను అత్యవసరంగా రాయబార కార్యాలయానికి పంపించాలని సూచించింది. అత్యవసరమైతే వారిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సూచనలు జారీ చేసింది. దేశాల మధ్య ఉద్రిక్తలు తలెత్తితే ఆయా దేశాలలో శాంతిని కాంక్షిందే తప్ప..అగ్రదేశాల మాదిరి తప్పొప్పులను సరిద్దిద్దే అవకాశాన్ని పొందలేకపోతున్నది భారత్. అలాంటి రోజేగనుక వస్తే భారత్ తిరుగులేని శక్తిగా మారినట్లే.

Also read: AP PRC Issue: ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే నిరాహార దీక్షలు