Diwali Lamps : దీపావళి రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలంటే?…

ఇంట్లో అలక్ష్మి తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ దరిద్రదేవతను సాగనంపాలని పండితులు సూచిస్తున్నారు.

Diwali  Lamps : దీపావళి రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలంటే?…

Deepam

Diwali Lamps : చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తుంది. దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పకుండా వెలిగించాలని శాస్త్రం చెబుతుంది. ఇంటి వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారం నిల్వవుంచే ప్రదేశాలలో, తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి.

అలాగే నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. ఇంట్లో అలక్ష్మి తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ దరిద్రదేవతను సాగనంపాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది.

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన పాదాలను మోపుతుందట. అందుకే దీపావళి రోజు ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి.