#BudgetSession: రాజకీయ స్థిరత్వం లేని దేశాలను సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి: రాష్ట్రపతి ముర్ము
రాజకీయ స్థిరత్వం లేని దేశాలను సంక్షోభాలు చుట్టుముడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అభివృద్ధిలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉందని, రాజకీయ స్థిరత్వం ఉండడం, దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు కారణమని అన్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉండడంతో అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఇవాళ పార్లమెంటులో ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

#BudgetSession: రాజకీయ స్థిరత్వం లేని దేశాలను సంక్షోభాలు చుట్టుముడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అభివృద్ధిలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉందని, రాజకీయ స్థిరత్వం ఉండడం, దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు కారణమని అన్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉండడంతో అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఇవాళ పార్లమెంటులో ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
గరీబీ హఠావో అనేది ఇకపై కేవలం ఓ నినాదం మాత్రమే కాబోదని, పేదల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, సాధికారత కోసం ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో 11 కోట్ల కుటుంబాలకు నల్లా ద్వారా మంచినీటిని అందేలా చేసిందని తెలిపారు. ఎలాంటి వివక్షకూ తావివ్వకుండా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
విధానలోపాన్ని వీడి దేశం ముందడుగు వేస్తోందని అన్నారు. కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు జరుపుకున్నామని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని తెలిపారు.
దేశం ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిర్భవిస్తోందని అన్నారు. తొమ్మిదేళ్ల తమ ప్రభుత్వంలో పౌరుల ఆత్మ విశ్వాసం పెరిగిందని తెలిపారు. అవినీతి అంతం దిశగా దేశం అడుగులు వేస్తోందని చెప్పారు. కాగా, రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రసంగానికి హాజరయ్యారు.