UPI Payments: యూపీఐ పేమెంట్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త!!

దేశంలో ప్ర‌స్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పుంజుకుంటుండగా.. డిజిట‌ల్ చెల్లింపుల్లో కాస్త అవకతవకలు జరుగుతున్నాయి. 2016లో మొదలైన యూపీఐ సేవ‌ల‌తో గ‌త ఆర్థిక..

UPI Payments: యూపీఐ పేమెంట్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త!!

Upi Payments

UPI Payments: దేశంలో ప్ర‌స్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పుంజుకుంటుండగా.. డిజిట‌ల్ చెల్లింపుల్లో కాస్త అవకతవకలు జరుగుతున్నాయి. 2016లో మొదలైన యూపీఐ సేవ‌ల‌తో గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ల‌క్ష కోట్ల డాల‌ర్ల లావాదేవీలు జ‌రిగాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. గ‌త నెల‌లో రికార్డు స్థాయిలో తొలిసారి రూ.500 కోట్ల లావాదేవీలు న‌మోద‌య్యాయి.

ప‌లు ఆర్థిక సంస్థ‌లు, ప్ర‌జ‌లు, బ‌హుళ వాటాదారులు ప‌దేప‌దే జరుపుతున్న యూపీఐ చెల్లింపుల్లో అదే స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని లక్షల్లో సొమ్ము లూటీ చేస్తున్నారు. ఇటువంటి మోసాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌తి యూపీఐ యూజ‌ర్ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

    1. గుర్తు తెలియ‌ని నంబ‌ర్ నుంచి మెసేజ్ వ‌స్తే.. దాని గురించి మీకు తెలియ‌క‌పోతే దానిపై చాటింగ్ వంటి ఎటువంటి చ‌ర్చ జ‌రుపవ‌ద్దు.
    2. వెబ్‌సైట్ల సోర్స్ నుంచి షేర్ చేసే ఫోన్ నంబ‌ర్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
    3. చాలా మంది త‌మ‌కు వ‌చ్చిన మెసేజ్‌లో పిన్ నంబ‌ర్ షేర్ చేయ‌మ‌ని ఉంద‌ని.. అలా మోస‌పోయామ‌ని చెబుతున్నారు.
    4. కొన్ని నిర్దిష్ట యూపీఐ ఐడీల ద్వారా పేమెంట్ రిక్వెస్ట్‌ల‌ను ట్రాక్ చేయొచ్చు.
    5. ప‌లు యూపీఐ యాప్‌లు వివిధ బ్యాంకుల్లో ఖాతాదారుల వ్య‌క్తిగ‌త డిటైల్స్ తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటాయి.
    6. యూపీఐ ద్వారా మ‌నీ పే చేయ‌డానికి గానీ, పొంద‌డానికి గానీ వ్య‌క్తిగ‌త స‌మాచారం కావాల‌ని అడుగుతుంటాయి.
    7. బ్యాంకు యాప్‌ల‌ను పోలిన న‌కిలీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం మోస‌గాళ్లకు చేరిపోతే తేలిగ్గా న‌గ‌దు దొంగిలించేస్తారు.

Read Also : గూగుల్ పేలో కొత్త ఫీచర్.. యూపీఐ ట్రాన్సాక్షన్లు ఇక ఈజీ..!

మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు

    1. మీ పిన్ నంబ‌ర్‌ను అప‌రిచితుల‌తో షేర్ చేయొద్దు
    2. మీ ఫోన్ల‌లో యాంటీ వైర‌స్‌, బ‌యో మెట్రిక్ రిక‌గ్నైజేష‌న్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి
    3. గుర్తు తెలియని వ్య‌క్తుల నుంచి వ‌చ్చే లింక్‌లు, ఈ-మెయిల్స్ తెర‌వొద్దు.
    4. మీ బ్యాంకు శాఖ‌లో ఎప్ప‌టిక‌ప్పుడు డిటైల్స్ అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
    5. మీకు న‌మ్మ‌క‌మైన వైఫై క‌నెక్ష‌న్ల‌ను మాత్ర‌మే వాడాలి.
    6. మీ ఆర్థిక లావాదేవీల‌ను, బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాలి.