భారతదేశంలో మైనార్టీలెవ్వరు? ముస్లిం ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలు కారా?

  • Published By: sreehari ,Published On : February 29, 2020 / 10:31 AM IST
భారతదేశంలో మైనార్టీలెవ్వరు? ముస్లిం ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలు కారా?

ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి శుక్రవారం ఓ వివరణ అడిగింది. దేశమొత్తం మీద హిందువులు మెజార్టీయేకాని చాలారాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకీ మైనార్టీ హోదా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతుకుముందు సుప్రీంకోర్టుకూడా మైనార్టీలకిచ్చే 4,700 కోట్ల ప్రయోజనాలను హిందూధార్మిక సంస్థలకు నిరాకరిస్తున్నారన్న పిటీషన్‌ పై కేంద్రాన్ని, మైనార్టీ కమీషన్, సెంట్రల్ వోక్ఫ్ బోర్డుకూడా అభిప్రాయాన్ని చెప్పమని ఆదేశించింది సుప్రీంకోర్టు. 

National Commission for Minorities Act, 1992లోని సెక్షన్  2(C) ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధులు, పార్శీలకు మైనార్టీ స్టాటస్‌నిచ్చారు.  మైనార్టీ హోదాఇవ్వడం వెనుక దేశంలోని వాళ్ల జనాభాను ప్రాతిపదకగా తీసుకున్నారు. అంతేగాని రాష్ట్రాల వారీగాకాదు. అందుకే సుప్రీం కోర్టు 2019 డిసెంబర్ 17న రాష్ట్రజనాభా ఆధారంగా కొన్ని రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీ స్టేటస్ ఇవ్వాలన్న పిటీషన్‌ను కొట్టేసింది. ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా మతాలను పరిగణలోకి తీసుకోలేం, దేశ జనాభా లెక్కనే మైనార్టీ హోదా ఇవ్వాల్సిందేనని తేల్చేసింది.  

 “రాష్ట్రాలు బాషాప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. మతం లెక్కన కాదు. జమ్ముకాశ్మీర్‌లో మెజార్టీగా ఉండి, మిగిలిన దేశమంతటా మైనార్టీగా ఉంటే ఏం సమస్య? లక్షద్వీప్‌‌లో హిందువుల జనాభా రెండు శాతమే కావచ్చు. దేశం మొత్తం మీద ఎక్కువ కాదా?”

బీజేపీ సమస్య ఏంటి?
మైనార్టీ హోదాను మరీ ప్రాంతాలవారీగా, స్థానికంగా చూడటమే బీజేపీకున్న అసలు సమస్య. దేశవ్యాప్తంగా ఉన్న జనాభా లెక్కలు రాష్ట్రాలవారీగా మారిపోతాయి. జిల్లాలకెళ్లేసరికి ఈ మార్పుల్లో చాలా తేడా కనిపిస్తుంది. రాష్ట్రాల వారీగా చూసినా, ఒక మైనార్టీ కమ్యూనిటీ మెజార్టీగా ఉండదు. కొన్నిప్రాంతాల్లో జనాభాలో ఎక్కువ ఉంటారు. అంతేకాని దేశంమొత్తం మైనార్టీగా ఉండి, కొన్ని రాష్ట్రాల్లో మెజార్టీగా ఉండవు.  ఉదాహరణకు మణిపూర్ లో నాలుగు జిల్లాల్లో క్రైస్తువుల జనాభా ఎక్కువ.  మలప్పరం జిల్లాలో ముస్లింలు 70శాతం. సిక్కిం ఉత్తర జిల్లాలో, అరుణాచల్ లో తవాంగ్ జిల్లాలో బౌద్ధులెక్కువ. అలాగని రాష్ట్రం మొత్తం వాళ్లు మెజార్టీకాదు. 

ఒకవైపు రాష్ట్రాల్లో హిందువులకి మైనార్టీ హోదా కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే శివసేన నేతృత్వంలోని మహారాష్ట్రప్రభుత్వం, ముస్లింలకు విద్యాసంస్థల్లో 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది.