ఢిల్లీ అల్లర్ల వెనుక ఉంది ఎవరు

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 03:32 PM IST
ఢిల్లీ అల్లర్ల వెనుక ఉంది ఎవరు

ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..ఇంతకీ పాతిక మందిని పొట్టనబెట్టుకుంది ఎవరు కేంద్రమా..రాష్ట్రమా.. ? నాలుగు రోజుల అల్లర్ల తర్వాత  ఈశాన్య ఢిల్లీ ఇప్పుడిప్పుడే కొలుకోంటోంది. వీటికి కారణం ఏంటి ? విద్వేషమా ? రాజకీయమా  ? ఏది నిజం ? 

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా రంగంలోకి దిగగానే ఢిల్లీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరిదే పని ముందే ఎందుకు చేయలేదు ? ఢిల్లీ పౌరులతో పాటు దేశంలో ఎవరిమదిలో అయినా మెదులుతోన్న ప్రశ్నలివి. బాధ్యత లేకుండా కేంద్ర మంత్రులు కూడా రెచ్చగొట్టే కామెంట్లు చేయడమే ఢిల్లీ అల్లర్లకు కారణమా ? ఔననే అని మండిపడుతోంది కాంగ్రెస్. రెండు రోజుల నుంచి ఆ పార్టీ ఢిల్లీ విధ్వంసంపై హంగామా చేస్తోంది. గురువారం రాష్ట్రపతిని కూడా కలిసింది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాల్సిందేనంటూ మరోసారి డిమాండ్ చేసింది. ఘర్షణలకు కేంద్రం, ఆమ్ ఆద్మీ రెండూ కారణమని ఆరోపించింది. దీంతో ఢిల్లీ అల్లర్లపై బ్లేమ్‌గేమ్ తారాస్థాయికి చేరింది.

ఈ క్రమంలోనే దీనికి తోడు బిజెపి లీడర్లపైనా.. అల్లర్లు జరుగుతుంటే చోద్యం చూసిన పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జస్టిస్ ట్రాన్స్ ఫర్ అవడంతో కాంగ్రెస్‌కి మరో ఆయుధం దొరకబుచ్చుకుంది. బిజెపిపై విమర్శలు మరింత ఎక్కువ చేసింది. బిజెపి కూడా దీన్ని తిప్పికొట్టేందుకే ప్రయత్నించింది తప్ప.. వాస్తవానికి తామెందుకు అల్లర్లను కంట్రోల్ చేయడంలో విఫలమైందీ చెప్పలేదు.

కాంగ్రెస్ కానీ బిజెపి కానీ రాజకీయ క్రీడనే ఆడుతున్నాయనే విమర్శలున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకపోతే.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. అందులోనూ కోర్టు మొట్టికాయలతో కేంద్రబలగాలు రంగంలోకి దిగిన తర్వాతే ఇక్కడ పరిస్థితి చక్కబడటం చూస్తే.. ఈ చర్యలు ముందే ఎందుకు తీసుకోలేదనే సందేహం రాకతప్పదు..అలా తీసుకుని ఉంటే  ఖచ్చితంగా ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదంటారు విశ్లేషకులు.

Read More : కేసీఆర్ ఔదార్యం : వృద్ధుడి కోసం ఆగి..సమస్య తెలుసుకుని