కోవిడ్ టీకా ఎవరు వేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కోవిడ్ టీకా ఎవరు వేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Who can get the Covid – 19 vaccine : కరోనా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియకు ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు వ్యాక్సిన్‌ రవాణా జరుగుతోంది. జనవరి 16న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేల 934 కేంద్రాల్లో ఈ టీకాలను అందించనున్నారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ ఎలా వేస్తారు ? వేసుకుంటే..ఏమైనా అవుతుందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందర్నీ తొలిచేస్తున్నాయి. హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. టీకా వేసుకోవాలంటే ఎంత వయస్సు ఉండాలి, వేసుకున్న తర్వాత..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

కొవిషీల్డ్, కొవాగ్జిన్ సాధారణ ఫ్రిజ్ టెంపరేచర్ (2 నుంచి 8 డిగ్రీలు) వద్ద నిల్వ చేస్తారు. సాధారణ వ్యాక్సిన్ల మాదిరిగానే రవాణా, నిల్వ చేస్తారు. కరోనా సోకకుండా..అడ్డుకొనేందుకే టీకా వేస్తారు. వైరస్ సోకిన రోగులకు టీకా వేయరు.
18 సంవత్సరాలున్న వారిపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి టీకాలు అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆపై వయస్సున్న ప్రతొక్కరూ టీకా వేసుకోవచ్చు.

వైద్య సిబ్బంది, పారిశుధ్యం, పోలీసులు తదితర విభాగాల వారికి తొలుత టీకా వేస్తారు.
ఆ తర్వాత 50 ఏండ్లు దాటిన వారికి, అనంతరం 18 – 50 ఏండ్ల మధ్య వయస్సు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాద పడుతున్న వారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందచేస్తారు.

కరోనా నుంచి కోలుకున్న వారు 90 రోజుల పాటు ఎలాంటి టీకా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పటికే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉంటాయి కాబట్టి వైరస్ సోకుండా అడ్డుకుంటాయి. కనుక టీకా వేసుకోవాలో వద్దో వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
టీకా వేసుకున్న తర్వాత..సైడ్ ఎఫెక్ట్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాయి.

ఔషధ నియంత్రణ మండలి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అన్ని కొణాల్లో విశ్లేషించిన తర్వాతే..టీకా వినియోగానికి అనుమతినిచ్చాయి.
జ్వరం, జలుబు, దగ్గు సాధారణ లక్షణాలు ఉన్నా..టీకా వేసుకోవచ్చు. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న వారికి టీకా వేయరు. అవయవ మార్పిడి చేసుకున్న వారికి ఎప్పటికీ టీకా వేయరు. కొవిడ్ వ్యాక్సిన్ ను విడుదల చేసే సమయంలో పూర్తి మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి.