Cyrus Mistry: ఎవరీ సైరస్ మిస్త్రీ.. ఆయన సంపద ఎంతో తెలుసా?

ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్‌జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. 1991లో తన తండ్రికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీలోకి డైరెక్టర్‌గా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అనంతరం క్రమంగా ఎదుగుతూ ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా మారారు. అయితే, అనంతరం జరిగిన పరిణామాల వల్ల ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Cyrus Mistry: ఎవరీ సైరస్ మిస్త్రీ.. ఆయన సంపద ఎంతో తెలుసా?

Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో మరణించిన సైరస్ మిస్త్రీ ప్రముఖ వ్యాపార దిగ్గజం షాపూర్‌జి పల్లోంజి కుమారుడు. 1968 జూలై 4న ఆయన జన్మించారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుకున్నారు. లండన్ యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

1991లో తన కుటుంబానికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీలోకి డైరెక్టర్‌గా ఎంటర్‌ అయ్యారు. తన తండ్రి తప్పుకోవడంతో 2006లో టాటాసన్స్‌ బోర్డులో చేరారు. టాటా ఎలెక్సీలో డైరెక్టర్‌గా పనిచేశారు. టాటా పవర్‌ డైరెక్టర్‌గా కూడా కొన్నాళ్లు ఉన్నారు. ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా రతన్‌ టాటా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత, టాటా గ్రూప్‌కు సారథ్యం వహించే అవకాశం సైరస్‌ మిస్త్రీకి దక్కింది. డిసెంబర్, 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2013లో ‘ది ఎకనమిస్ట్’ ఆయన్ను బ్రిటన్‌, భారత్‌లో మోస్ట్ ఇంపార్టెంట్‌ ఇండస్ట్రియలిస్ట్‌గా పేర్కొంది. ఆయన యంగ్ అండ్‌ డైనమిక్‌ బిజినెస్‌ మెన్‌గా పేరు తెచ్చుకున్నారు. 2016 అక్టోబర్‌ వరకు ఆయన టాటాగ్రూప్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

Ramon Magsaysay award: రామన్ మెగెసెసే అవార్డు నిరాకరించిన సీపీఎం మహిళా నేత.. కారణమేంటంటే

ఆ తర్వాత అభిప్రాయ బేధాలతో టాటా సన్స్.. సైరస్ మిస్త్రీని ఆ పదవి నుంచి తొలగించింది. చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై టాటా గ్రూప్‌పై మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. టాటా సన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వాలని సైరస్ కోరారు. అయితే, టాటాలకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో సైరస్ మిస్త్రీ వెనక్కి తగ్గారు. టాటా సన్స్‌లో సైరస్‌మిస్త్రీకి 18.4శాతం వాటా ఉంది. 2018 లెక్కల ప్రకారమే ఆయన ఆస్తి దాదాపు 80వేల కోట్లు.