Rohini court : ఎవరీ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి, ఎక్కడుండే వాడు ? ఏం చేస్తుంటాడు ?

కోర్టులో గ్యాంగ్‌ వార్‌  కలకలం సృష్టించింది. రోహిణి కోర్టు ఆవరణలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ మన్ గోగిని దుండగులు కాల్చి చంపారు.

Rohini court : ఎవరీ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి, ఎక్కడుండే వాడు ? ఏం చేస్తుంటాడు ?

Gangstar

Gangster Jitender Gogi : ఢిల్లీ కోర్టులో గ్యాంగ్‌ వార్‌  కలకలం సృష్టించింది. మధ్యాహ్నం రోహిణి కోర్టు ఆవరణలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ మన్ గోగిని దుండగులు కాల్చి చంపారు. దీని తర్వాత కోర్టు పరిసరాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు జరిపిన వారిని కూడా కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. 30 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రూమ్‌ నెంబర్ 207లో ఈ కాల్పులు జరిగాయి.

Read More : Delhi Court : కోర్టులో గ్యాంగ్‌‌స్టర్‌‌ల మధ్య కాల్పులు, జితేందర్ గోగి హతం

పేరు మోసిన గ్యాంగ్ స్టర్ : –
జితేందర్‌ గోగి… పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌. పదేళ్లుగా పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న క్రిమినల్‌. అతడిపై లెక్కలేనన్ని కేసులున్నాయి. చాలామందిని హత్య చేయడంతో పాటు బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు అతడిపై ఫిర్యాదులున్నాయి. కాలేజ్‌ రోజుల నుంచే క్రిమినల్‌గా మారాడు జితేందర్‌ గోగి. టిల్లూ అనే గ్యాంగ్‌స్టర్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేసిన జితేందర్‌… అతడి బాటలోనే గ్యాంగ్‌స్టర్‌ అవతారమెత్తాడు. కొన్నాళ్లకు టిల్లూ, జితేందర్‌ గ్యాంగ్‌ల మధ్య గొడవలు కావడంతో.. ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు.

Read More : Goat Eating Fish : పచ్చి చేపల్ని..పచ్చిగడ్డిలా తినేస్తున్న మేక..

మూడు రాష్ట్రాల్లో అడ్డా : –
పదేళ్లుగా ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లను అడ్డాగా చేసుకుని రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. మూడు రాష్ట్రాల్లో కలిపి అతడిపై పదుల సంఖ్యలో కేసులున్నట్లు పోలీసులు చెప్తున్నారు. చిన్నచిన్న నేరాలతో జీవితాన్ని ప్రారంభించిన జితేందర్‌ గోగి… ఆ తర్వాత పెద్ద క్రిమినల్‌గా మారిపోయాడు. ఓ గ్యాంగ్‌ను రెడీ చేసి బిజినెస్‌మెన్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్ని, బుకీల్ని టార్గెట్‌ చేశాడు. వారి నుంచి కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వని వారిని నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నాడు.మూడు రాష్ట్రాల్ని వణికించిన జితేందర్‌ గోగి… చాలా ఏళ్లుగా పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఖాకీలకు చిక్కకుండా అండర్‌ గ్రౌండ్‌లో ఉంటూ… లెక్కలేనన్ని నేరాలు చేశాడు.

Read More : Jagga Reddy: చిరంజీవి, రజినీకాంత్ ఫెయిల్.. రేవంత్‌ హీరోయిజం పనికిరాదు-జగ్గారెడ్డి

పట్టుకోవాలని పట్టుదలగా ప్రయత్నించిన పోలీసులు : –
జితేందర్‌ను ఎలాగైనా పట్టుకోవాలని పట్టుదలగా ప్రయత్నించిన పోలీసులు… నాలుగేళ్లపాటు అతడి వెంటపడ్డారు. చివరకు గతేడాది మార్చి 3న జితేందర్‌ గోగికి బేడీలు వేశారు.జితేందర్‌ను పట్టుకునేందుకు పోలీసులకు ఫేస్‌బుక్‌ ఉపయోగపడింది. జితేందర్‌తో పాటు అతడి గ్యాంగ్‌ మెంబర్లు వాడుతున్న ఫేస్‌బుక్‌ అకౌంట్లను పోలీసులు ట్రాక్‌ చేశారు. చివరకు ఓ డీల్‌ కోసం స్టార్‌బక్స్‌ హోటల్‌కు వెళ్తున్నట్లు ఒకరు ఫొటో పెట్టడంతో… పోలీసులు అక్కడ మాటు వేశారు. జితేందర్‌తో పాటు ఫజ్జా, గౌరవ్‌, మోయి అనే క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆరు పిస్టల్స్ తో పాటు 70 బుల్లెట్లను సీజ్‌ చేశారు. ఏడాది నుంచి జైల్లో ఉన్న జితేందర్‌ను ఓ కేసులో విచారణ కోసం 2021, సెప్టెంబర్ 24వ తేదీ శుక్రవారం రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యర్థులు మాటు వేసి జితేందర్‌ను కాల్చి చంపారు.