మోడీ ట్విట్టర్ హ్యాకర్ జాన్ విక్ గురించి తెలుసా..

మోడీ ట్విట్టర్ హ్యాకర్ జాన్ విక్ గురించి తెలుసా..

Keanu Reeves Is John Wick: ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ వెబ్‌సైట్.. గురువారం తెల్లవారుజామున హ్యాకింగ్ కు గురైంది. ఫాలోవర్లను క్రిప్టోకరెన్సీ పేరిట డొనేట్ చేయాలని వరుస ట్వీట్లతో ఆయన అకౌంట్ నిండిపోయింది. నరేంద్ర మోడీ మొబైల్ అప్లికేషన్ కు సంబంధించిన పర్సనల్ వెబ్‌సైట్.. 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.



ఈ యాక్టివిటీ గమనించిన ట్విట్టర్ అఫీషియల్స్ మరింత సెక్యూర్ గా ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘పరిస్థితిపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ సమయంలో మిగిలిన అకౌంట్లపైనా దాడి జరుగుతుందని అనుకోవడం లేదు’ అని ట్విట్టర్ ప్రతినిధి ఓ ఈ-మెయిల్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు.
https://10tv.in/pm-cares-fund-received-rs-3076-crore-in-just-5-days-but-the-names-of-these-generous-donors-will-not-be-revealed-why/
@narendramodi_in అకౌంట్లో చేసిన ట్వీట్లకు సంబంధించిన రిక్వెస్ట్ కామెంట్లకు మోడీ ఆఫీసు నుంచి అంత త్వరగా స్పందన రాలేదు. ఫాలోవర్లను పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కోసం క్రిప్టోకరెన్సీ రూపంలో డొనేట్ చేయాలని పలుమార్లు అడిగాడు. పైగా ట్వీట్లలో అతను ‘జాన్ విక్’ అని చెప్పుకున్నాడు.



ఎలియోట్ ఆల్డర్‌సన్ అలియాస్ John Wick .. అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. కేనూ రీవ్స్ ఈ రోల్ లో కనిపించారు. అదే పేరు మీద హాలీవుడ్ మూవీ కూడా ఉంది. 2014లో రిలీజ్ అయిన John Wick రెండు సీక్వెల్స్ లో వచ్చింది. John Wick: Chapter 2, 2017లో, John Wick: Chapter 3 – Parabellum 2019లో రిలీజ్ అయ్యాయి.

చాలా మంది హ్యాకర్లు Elliot Alderson పేరునే చెప్పుకుంటారు. నిజానికి ఇది కూడా అలాంటి క్యారెక్టరే. రామి మలేక్ నటించిన రోల్. సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ లేదా సినిమాల్లో హ్యాకర్ లా అతను కనిపిస్తాడు.



పీఎం మోడీ ట్విట్టర్ హ్యాకింగ్ రీసెంట్ గా అయింది కానీ, నిజానికి మిగిలిన పర్సనాలిటీల అకౌంట్ జులైలోనే అయింది. గుర్తు తెలియని హ్యాకర్లు టెక్నాలజీ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రధాన కంపెనీలకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు.