జేపీ నడ్డా ఎవరని ప్రశ్నించిన రాహుల్..అగ్రి చట్టాలపై బుక్ లెట్ రిలీజ్

జేపీ నడ్డా ఎవరని ప్రశ్నించిన రాహుల్..అగ్రి చట్టాలపై బుక్ లెట్ రిలీజ్

RAHULGANDHI:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్​ పార్టీ రూపొందించిన బుక్ ​లెట్​ను మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేంద్రంపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళనను కేంద్రం అశ్రద్ధ చేస్తోందన్నరు. అంతేగాక దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తాను కేవలం రైతుల గురించి మాత్రమే మాట్లాడటం లేదని.. ప్రభుత్వ మొండి వైఖరిలో ఇది ఒక భాగం మాత్రమేనని… భవిష్యత్తు దృష్యా యువత దీన్ని గమనించాలని రాహుల్ అన్నారు.

మరోవైపు,ఇవాళ తన మీడియా సమావేశానికి ముందు చైనా విషయంపై,రైతుల విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు 10ప్రశ్నలు సంధించడంపై ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ…జేపీ నడ్డా ఎవరు? ఆయనకు నేనెందుకు సమాధానం చెప్పాలి?ఆయనేమైనా నా ఫ్రొఫెసరా?నేను దేశానికి సమాధానం చెబుతాను అని రాహుల్ నడ్డా కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు.

కాగా, ఇవాళ రాహుల్ గాంధీ మీడియా సమావేవానికి ముందు జేపీ నడ్డా చేసిన వరుస ట్వీట్ లలో…మొత్తానికి నెల రోజుల సెలవు తర్వాత రాహుల్ గాంధీ తిరిగొచ్చాడు.ఆయనను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన వీటికి సమాధానం చెబుతాడనుకుంటున్నాను. చైనాపై రాహుల్ గాంధీ,ఆయన వంశం,కాంగ్రెస్ పార్టీ అబద్దాలడటం మానేస్తుంది? రాహుల్ గాంధీ ప్రస్తుతం ప్రస్తావిస్తోన్న అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రాంతంతో పాటు భారత భూభాగంలోని వేల కిలోమీటర్లు చైనావాళ్లకి పండిట్ నెహ్రూ గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని రాహుల్ తిరస్కరించగలడా? మళ్లీ కాంగ్రెస్ ఎందుకు చైనాకు సరెండర్ అవుతోంది? చైనా,దాని కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ కుదుర్చుకున్న MOUని రద్దు చేయాలన్న ఉద్దేశ్యం ఏమైనా రాహుల్ గాంధీకి ఉందా?

కోవిడ్-19కి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న దేశాన్ని నిరుత్సాహపర్చడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని రాహుల్ వదిలిపెట్టలేదు. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తగ్గాయి..మన సైంటిస్టులు వ్యాక్సిన్ కనిపెట్టారు.. సైంటిస్టులను మరియు రాహుల్ ఎందుకు అభినందించలేదు..130కోట్ల మంది భారతీయులను కనీసం ఒక్కసారైనా రాహుల్ ఎందుకు ప్రశంసించలేదు. దేశ రైతులను రెచ్చగొట్టడం,తప్పుదోవపట్టించే పనిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆపేస్తోంది.

కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైతుల పట్ల సానుభూతిని రాహుల్ ప్రదర్శిస్తారా?యూపీఏ హయాంలోMSP ఎందుకు పెంచలేదు? రాహుల్ గాంధీ తమిళనాడులో జల్లికట్టుని చూసి ఆనందించారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నసమయంలో జల్లికట్టుని ఎందుకు బ్యాన్ చేశారు..తమిళనాడు సాంప్రదాయాన్ని అవమానించారు? ధైర్యం కూడగట్టుకొన్నిఈ ప్రశ్నలన్నింటీకి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఆయన చెప్పకపోతే..ఈ ప్రశ్నలను మీడియా మిత్రులు రాహుల్ ని అడగాలని నేను కోరుతున్నా అని నడ్డా తాను చేసిన వరుస ట్వీట్ లలో తెలిపారు.