Piyush Jain : పాత స్కూటర్ పై తిరిగే సెంటు వ్యాపారి ఇంట్లో కోట్ల నోట్ల కట్టలు

పీయూష్ జైన్...ఈయన గురించి ఇప్పుడు స్పెషల్‌గా ఇంట్రడక్షన్ అవసరం లేదు..వారం రోజుల క్రితం వరకు కేవలం ఓ సెంటు వ్యాపారి మాత్రమే...ఇప్పుడు నేషన్‌ వైడ్‌గా ఈయన హెడ్‌లైన్ న్యూస్‌గా మారిపోయా

Piyush Jain : పాత స్కూటర్ పై తిరిగే సెంటు వ్యాపారి ఇంట్లో కోట్ల నోట్ల కట్టలు

Piyush Jain

Piyush Jain :  తీగ లాగితే డొంక కదలడం అంటే ఏంటో మీకు తెలుసా…? ఏదో ప్రాస కోసం మీకు ఈ మాటలు చెప్పడం లేదు. నిజంగానే తీగ లాగితే.. డొంక ఎలా కదులుతుందో మీకు చూపించబోతున్నాం. ఇంతకీ ఆ తీగ ఏంటో.. ఆ డొంక ఏంటో తెలుసుకోవాలంటే.. కాన్పూర్ దాకా వెళ్లి రావాల్సిందే.

పీయూష్ జైన్…ఈయన గురించి ఇప్పుడు స్పెషల్‌గా ఇంట్రడక్షన్ అవసరం లేదు..వారం రోజుల క్రితం వరకు కేవలం ఓ సెంటు వ్యాపారి మాత్రమే…ఇప్పుడు నేషన్‌ వైడ్‌గా ఈయన హెడ్‌లైన్ న్యూస్‌గా మారిపోయారు.. పన్నులు ఎగ్గొట్టే వాళ్ల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తే పదో ఇరవై కోట్లు బయటపడటం మామూలు విషయం… కానీ పీయూష్ జైన్ అలాంటి…. ఇలాంటి … ట్రేడర్ కాదు… ప్రభుత్వాన్ని ఏమార్చి ఈయన గారు వెనకేసిన నోట్ల కట్టలను లెక్కపెట్టడానికి అధికారులు ఆపసోపాలు పడుతూనే ఉన్నారు.

పీయూష్‌ జైన్ అక్రమాలను రెండు మూడు గంటల్లో లెక్క తేలుద్దామని ఆయన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన అధికారులు… ఒక్కొక్కటిగా బయటపడుతున్న నోట్ల కట్టలను చూసి షాక్ మీద షాక్ తిన్నారు… స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓ పెద్ద టీమ్… 20 క్యాష్ కౌంటింగ్ మిషన్స్‌తో రోజుల తరబడి లెక్కపెడుతున్నా…ఇంకా లెక్క తేలలేదంటే పీయూష్‌ అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు…

ఇంతకీ ఇంత పెద్ద చేప జీఎస్టీ అధికారులకు ఎలా చిక్కింది…? రెండు పాత కార్లు, బాగా పాత మోడలైన బజాజ్ ప్రియ స్కూటర్‌పై తిరుగుతూ సాదాసీదా జీవితం గడిపే ఓ సెంటు వ్యాపారి గుట్టు ఎలా రట్టయ్యింది…?

ఇన్‌కమ్‌ టాక్స్‌, జీఎస్టీ అధికారులు ఎక్కడో తీగ లాగితే… పీయూష్ జైన్ డొంక కదలింది. ఆ తీగే పొగాకు… పాన్ మసాలా ట్రక్కులు… కాన్పూర్‌లో షిఖర్ మాసాలా పేరుతో ఓ ఫ్యాక్టరీ ఉంది… గణపతి రోడ్ కారియర్‌ పేరుతో వీళ్లు ఫేక్ ఇన్‌ వాయిస్‌లు సృష్టించి… జీఎస్టీ ఎగ్గొట్టారు. నాలుగు ట్రక్కులపై దాడులు చేసి పొగాకు, పాన్ మసాలాను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Also Read : Black Magic : డోన్‌లో క్షుద్రపూజల కలకలం

ఆ సంస్థ కార్యాలయంలో దాదాపు 200లకు పైగా ఫేక్ ఇన్‌వాయిస్‌లను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు విచారణ జరుపుతున్నప్పుడు షికర్ పాన్ మసాలా కంపెనీ ఓనర్… షిఖర్ గుప్తా కొన్ని విషయాలు బయటపెట్టారు.

ట్యాక్స్‌ ఎగ్గొట్టి ఫేక్ ఇన్‌వాయిస్‌లు సృష్టించిన మాట నిజమేనని ఒప్పుకున్న షిఖర్ గుప్తా తన కంపెనీలో మరో భాగస్వామి ఉన్నట్టు చెప్పాడు. ఓడోకామ్‌ ఇండస్ట్రీతో ఉన్న బిజినెస్ డీల్స్‌ గురించి వివరించాడు… షిఖర్ గుప్తా అందించిన ఆ ఉప్పే… పీయూష్ జైన్‌ కొంప ముంచింది… ఒడోకామ్ ఇండస్ట్రీస్ ఓనర్ మరెవరో కాదు… బస్తాల కొద్దీ నోట్ల కట్టలు కూడపెట్టిన పీయూష్‌ జైనే…

Also Read : Covid-19 Positive: రంగారెడ్డిలో ఒకేసారి14 మందికి కొవిడ్ పాజిటివ్

నాలుగు ట్రక్కులో ఉన్న పొగాకు… పాన్ మసాలా లోడ్‌…చివరకు పీయూష్‌ జైన్ అక్రమ సామ్రాజాన్ని కుప్పకూల్చింది….డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌…డీజీజీఐ స్వయంగా రంగంలోకి దిగి పీయూష్‌ జైన్ ఆటకట్టించారు. 300 కోట్ల రూపాయల నగదుతో పాటు… 23 కేజీల బంగారం.. 600 కేజీల శాండిల్ వుడ్ ఆయిల్‌… సీజ్ చేశారు… ఇంకా లెక్కించాల్సిన నోట్ల కట్టలు… మిగిలే ఉన్నాయి.

సాదాసీదా జీవితం… తిరిగేది పాత కార్లు.. పైగా సెంటు వ్యాపారం… తన గురించి ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాడు పాపం పీయూష్ జైన్..కానీ….నాలుగు పొగాకు ట్రక్కులు…ఈయన బండారాన్ని బయటపెట్టాయి.

కాగా….. పీయూష్ జైన్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దం నడుస్తోంది….పీయూష్ జైన్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సన్నిహితుడని బీజేపీ నాయకులు ఆరోపించారు. దాన్ని అఖిలేష్ తిప్పి కొట్టారు. పీయూష్ తో తమకెలాంటి సంబంధాలు లేవని సొంతపార్టీ నేత అయిన జైన్ పై పొరపాటున బీజేపీ దాడి చేయించిందన్నారు.

పీయూష్ జైన్ ఇంట్లో డబ్బులు లెక్కించటానికి దాదాపు 20 కౌంటింగ్ మిషన్లుతో నాలుగు రోజుల పాటు బ్యాంకు అధికారులు నానా కష్టాలు పడ్డారు. దీనితో పాటు 23 కిలోల బంగారం, 250 కిలోల వెండి 600 కిలోల గంధపు చెక్కల నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.