Delhi Big Sex Rocket : సోనూ పంజాబన్ కు 24 ఏళ్ల జైలు శిక్ష..దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 08:34 AM IST
Delhi Big Sex Rocket : సోనూ పంజాబన్ కు 24 ఏళ్ల జైలు శిక్ష..దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్న నిర్వాహకురాలు Sonu Punjaban కు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ..ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జస్టిస్ ప్రీతమ్ సింగ్ సంచలన తీర్పును వెలువరించారు. ఆమె సహచరుడు సందీప్ కూడా దారుణాలకు పాల్పడినట్లు, ఇతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు.

సోనూ పంజాబన్, గీతా అరోరాలు ఢిల్లీలో అక్రమంగా మహిళలను తరలించడం, బలవంతంగా లైంగిక కార్యకలాపాల్లో దింపేవారు. 1981లో జన్మించిన సోనూ…దేశ రాజధానిలో కాకుండా..చుట్టుపక్కల గ్యాంగ్ స్టర్ల సహాయంతో అతిపెద్ద సెక్స్ రాకెట్ ను నడిపింది.

చిన్న వయస్సులోనే సోనూ…Delhi – NCR అంతటా పేరు సంపాదించిందని, అనేక మంది గ్యాంగ్ స్టర్లతో సంబంధాలున్నాయని గుర్తించారు. వీరిలో కొంతమంది పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లలో మరణించారు. సోనూ జరిపిన సెక్స్ రాకెట్ లో ఎంతో మంది బిజినెస్ మెన్ లు, వ్యాపారవేత్తలు, మోడల్స్, నటీమణులున్నారని తేలింది.

గ్యాంగ్ స్టర్ హేమంత్ ను సోనూ వివాహం చేసుకుంది. ఎన్ కౌంటర్లో హేమంత్ చనిపోయిన అనంతరం మరొక గ్యాంగ్ స్టర్ శ్రీ ప్రకాష్ శుక్లా సన్నిహితుడు విజయ్ సింగ్ తో ప్రేమాయణం నడిపింది. సింగ్ కూడా చనిపోయాడు. ఈమె తదుపరి ప్రియుడు దీపక్ ను 2003లో ముక్తేశ్వర్ లో STF పోలీసులు కాల్చి చంపారు.

ఇక్కడ దీపక్ సోదరుడు హేమంత్..సోనూకు అండగా నిలబడ్డాడు. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఓ హత్య కేసులో హేమంత్ చిక్కుకున్నాడు. 2006, మార్చి నెలలో హేమంత్ ను ఢిల్లీ – గురుగ్రామ్ సరిహద్దులో పోలీసులు కాల్చి చంపారు.

2014 సంవత్సరంలో మైనర్ బాలికలను వ్యభిచారకూపంలోకి నెట్టారని సోనూ పంజాబన్ పై ఢిల్లీలోని Najafgarh పీఎస్ కేసు నమోదైంది. దీనిపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేపట్టింది. లైంగిక నేరాల చట్టం కింద కేసులు బుక్ చేశారు. మూడు సంవత్సరాల పాటు జరిగిన ఈ సెక్స్ రాకెట్ చెక్ పెట్టేందుకు ఓ మైనర్ అమ్మాయి పోలీసులకు సహాయపడింది.

ప్రస్తుతం సోనూకు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. మైనర్లను తరలించడం, బానిసత్వం, వ్యభిచారం కోసం మైనర్లను విక్రయించడం, నిర్భందించడం వంటి వాటిపై భారత శిక్షాస్మృతి, ఇతర కుట్రలపై సోనూను దోషిగా గుర్తించింది కోర్టు.