ఫోక్స్ చట్టంపై తీర్పు : ఎవరీ జ‌స్టిస్ పుష్ప వీరేంద్ర‌

ఫోక్స్ చట్టంపై తీర్పు : ఎవరీ జ‌స్టిస్ పుష్ప వీరేంద్ర‌

who justice pushpa virendra ganediwala : బాలిక శరీరాన్ని నేరుగా తాకలేదు..కదా..అది ఫోక్సో చట్టం ప్రకారం లైంగిక దాడి కిందకు రాదు..అంటూ ఓ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తీర్పు ఇచ్చింది కూడా మహిళా న్యాయమూర్తే కావడం విశేషం. అసలు ఎవరు తీర్పు ఇచ్చారంటూ..చాలా మంది వెతకడం ప్రారంభించారంట. జస్టిస్‌ పుష్ప గనేడివాలా ఈ తీర్పును ఇచ్చారు. ప్రస్తుతం మహిళా జస్టిస్ గురించి…అంతటా చర్చ జరుగుతోంది. అసలు ఈమె ఎవరు ? ఈ కేసులో తీర్పు ఇచ్చారు ? 2016లో ఓ బాలికను దుస్తుల మీద నుంచి ఓ వ్యక్తి నిమిరాడు. దీనిపై కేసు నమోదైంది. అది దాడి కాదు..కేవలం లైంగిక వేధింపు మాత్రమేనంటూ…బాబకే హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. జస్టిస్ పుష్ప ఆ తీర్పును వెలువరించారు.

పుష్ప వీరేంద్ర విషయానికి వస్తే…1969లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని పరాత్ వాడలో జన్మించారు. బీకామ్‌, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలు చేశారామె. 2007లో జిల్లా జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. ముంబైలోని సిటీ సివిల్ కోర్టులో, నాగ‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో ప‌ని చేశారు. అనంతరం నాగ‌పూర్‌లోనే ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ అండ్ సెష‌న్స్ జ‌డ్జి అయ్యారు. బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్‌గా నియ‌మితుల‌య్యారు.

2018లో బాంబే హైకోర్టుకు అపాయింట్ చేస్తూ..ఆదేశాలు వచ్చాయి. కొంత వ్యతిరేకత రావడంతో..దానిని తాత్కాలికంగా బ్రేక్ వేశారు. 2019లో మళ్లీ అపాయింట్ మెంట్ ను అంగీకరించారు. అనంతరం బాంబే హైకోర్టులో ఆమెను అడిషనల్ జడ్జిగా నియమించారు. పెరోల్‌కు సంబంధించి ఖైదీలకు ఉన్న పరిమిత హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనంలో జస్టిస్‌ పీఎన్‌ దేశ్‌ముఖ్‌, జస్టిస్‌ మనీష్‌ పితాలేతో పాటు జస్టిస్‌ పుష్ప గనేడివాలా కూడా ఉన్నారు. ఖైదీలకు పెరోల్ ఇవ్వడం పరిమితమైన హక్కు మాత్రమేనని, మళ్లీ మళ్లీ ఓ ఏడాదిలో పెరోల్ తీసుకోరాదు…అంటూ తీర్పు వెలువరించారు.

2019లో హత్యానేరంలో దోషులకు పడిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ రెండు కేసుల్లో తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ ఆమె సభ్యురాలిగా ఉన్నారు. 2020 సెప్టెంబర్ కోవిడ్ ఆసుపత్రుల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారనే దాఖలైన పిటిషన్ ను ఆమె విచారించారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆ కేసులో ప్రభుత్వాన్ని ఆదేశించారు. ముంబైలో ఫ్యామిలీ కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించాలని పబ్లిక్ గా కోరారు. వాయిదా పడిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను తిరిగి నిర్వహించాలని వచ్చిన పిటిషన్ ను పుష్ప తిరస్కరించారు. షెడ్యూల్ ప్రకారం..జరిగిన పరీక్షలకు హాజరు కాలేకపోయిన..వారికి మాత్రం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారామె.

మరికొన్ని కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్న జస్టిస్‌ పుష్ప గనేడివాలా జనవరి 15, 2021, జనవరి 2021 నాటి పోక్సో చట్టం కింద అరెస్టైన నిందితులకు పోక్సో చట్టం కింద శిక్ష పడదని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వెలుగులోకి వచ్చారు.