WHO: సీరం కమిట్మెంట్‌ను గుర్తు చేస్తూ.. వ్యాక్సిన్లు సకాలంలో అందించమంటోన్న డబ్ల్యూహెచ్ఓ

కొవిడ్ పై పోరాటంలో వ్యాక్సిన్లు త్వరితగతిన రెడీ చేయాలని సీరం సంస్థకు డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్‌కు త‌గ్గట్లు ప్రొడక్షన్ లేక‌పోవ‌డం

WHO: సీరం కమిట్మెంట్‌ను గుర్తు చేస్తూ.. వ్యాక్సిన్లు సకాలంలో అందించమంటోన్న డబ్ల్యూహెచ్ఓ

Who

WHO: కొవిడ్ పై పోరాటంలో వ్యాక్సిన్లు త్వరితగతిన రెడీ చేయాలని సీరం సంస్థకు డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్‌కు త‌గ్గట్లు ప్రొడక్షన్ లేక‌పోవ‌డం స‌మ‌స్య‌గా మారింది. పేద దేశాల‌కు కోవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవాక్స్ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

కోవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాలు టీకాలు అందించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్ర‌కారం ఇండియాలోని సీరం సంస్థ వ్యాక్సిన్లు అందివ్వ‌డం లేద‌ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సీరం సంస్థ కోవాక్స్ కోసం నిబద్ద‌తో టీకాల‌ను అందించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు.

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సకాలంలో వ్యాక్సినేషన్ చేపట్టినా జూలై నాటికి 19 కోట్ల టీకాల కొరత కనిపిస్తుందని అన్నారు. కోవాక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 124 దేశాల‌కు 6.5 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు. భార‌త్‌లో క‌రోనా ఉదృతి వ‌ల్ల కోవాక్స్ గ్రూపుకు టీకాలు సరిపడ రీతిలో అంద‌డం లేద‌ని యూనిసెఫ్ కూడా పేర్కొంది.

కోవాక్స్ గ్రూపుకు చేయూత‌నిచ్చేందుకు ఇండియా కూడా అంగీక‌రించింది. సీరం సంస్థ త‌యారు చేసే కోవీషీల్డ్ టీకాల‌ను 64 పేద దేశాల్లో పంపిణీ చేయాల్సి ఉంది. 2021లో పేద దేశాల‌కు ప‌ది కోట్ల డోస‌ులు ఇస్తామ‌ని సీరం, గ‌వీ, గేట్స్ ఫౌండేష‌న్ ప్ర‌క‌టించాయి.