ఫైన్ తప్పించుకోవాలని: కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్

ఫైన్ తప్పించుకోవాలని: కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్

కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండటానికి కారణమేంటో తెలుసా.. ప్రమాదానికి కాదు.. పోలీసులకు భయపడే కార్లో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నానని అలీఘర్‌కు చెందిన పీయూశ్ వార్ష్‌నీ అనే వ్యక్తి అంటున్నాడు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి రాకముందే అంటే ఆగస్టు 27నే పోలీసులు ఫోర్ వీలర్ నడుపుతున్న పీయూశ్‌కు రూ.500 జరిమానా విధించారు. 

దీని పట్ల భయంతోనే ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు పీయూశ్. మళ్లీ ఫైన్ వేస్తారోమనని భయంగా ఉంది.  కార్ నడుపుతూ హెల్మెట్ పెట్టుకోలేదని ఎక్కడ ఫైన్ వేస్తారోననే ఇలా చేస్తున్నాను. అప్పుడు చలానా ఇష్యూ అవగానే చూసుకుంటే అది నా కార్ నెంబర్’ అని వివరించాడు. 

అది మా తప్పే:
ఓ వ్యక్తి నుంచి కంప్లైంట్ వచ్చింది. తనకు వచ్చిన ఈ చలానాలో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేశారు. అందులో కార్ నెంబర్ మాత్రమే ఉంచారు. చలాను వెరిఫై చేస్తున్నాం. డేటాలో తప్పులుండటం వల్ల ఈ పొరబాటు జరిగింది. చలానా తప్పుగా వేశారని తెలిస్తే దానిని రద్దు చేస్తాం’ అని ట్రాఫిక్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అజిజుల్ హక్ తెలిపారు.