Nitish Kumar: ఇటువంటి అర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు?: సీఎం నితీశ్

దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలన్న ఆలోచనపై కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మాయిలకు చదువు కావాలని, వారు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఆడపిల్లలు చదువుకుంటున్నారు... సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 2.9కి తగ్గింది. దాన్ని ఇంకా తగ్గింది 2.0కి తీసుకురావాలి. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించాలని చాలా మంది అంటున్నారు’’ అని అన్నారు.

Nitish Kumar: ఇటువంటి అర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు?: సీఎం నితీశ్

cm nitish kumar

Nitish Kumar: దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలన్న ఆలోచనపై కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మాయిలకు చదువు కావాలని, వారు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఆడపిల్లలు చదువుకుంటున్నారు… సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 2.9కి తగ్గింది. దాన్ని ఇంకా తగ్గింది 2.0కి తీసుకురావాలి. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించాలని చాలా మంది అంటున్నారు’’ అని అన్నారు.

‘‘ఇటువంటి అర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు? అందులో ఏమన్న అర్థం ఉందా? ఒకవేళ అమ్మాయిలు చదువుకుంటే ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న పరిస్థితి వస్తుంది. బిహార్ లో మేము బాలికల చదువు కోసం కృషి చేస్తున్నాం’’ అని అన్నారు.

కాగా, దేశంలో జనాభా నియంత్రణ కోసం చట్టాన్ని తీసుకురావాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ చట్టం అవసరం లేదంటే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు నేతలు అంటున్నారు. అప్పట్లో చైనా ఇటువంటి పొరపాటే చేసిందని, ఇటువంటి చట్టం దేశానికి మంచిది కాదని చెబుతున్నారు.

Venkatesh: శైలేష్‌తో సినిమాను ఆ రోజున స్టార్ట్ చేస్తోన్న వెంకీ..?