మంచి వద్దు, నిజం అసలే వద్దు.. కావాల్సిందంతా బ్యాడ్‌ న్యూస్, రూమర్స్, గాసిప్స్.. మనిషి మెదడుకి ఏమైంది?

10TV Telugu News

human brain: రోడ్డుపై వెళ్తుంటే అనేక విషయాలు చూస్తుంటాం. మంచి చూస్తాం.. చెడూ చూస్తాం. కానీ మనిషి బుర్ర మాత్రం మంచి కన్నా చెడునే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది. మంచి మాటలు, మంచి పనుల కన్నా చెడు వాటినే తొందరగ గ్రహిస్తుంది. ఇది మానవుని సహజ లక్షణం. అయితే ఇందుకు కారణం మాత్రం మనిషి మెదడు. ఆ మెదడు నిర్మాణమే అలా ఉంది. మెదడులో జరిగే చర్యలే అందుకు కారణం అవుతాయి.

పక్కవారి రహస్యాలు, పనికిమాలిన గొడవలు..ఇలాంటివే మనిషి మెదడుకు చాలా ఇష్టం
పక్కవారి రహస్యాలు, పనికిమాలిన గొడవలు, వైరల్ అవుతున్న వార్తలు, చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. ఇలా జరిగిందంట… అలా జరిగిందంటా అనగానే లేనిపోని ఊహాగానాలు. దాని గురించి బుర్రలో ఏదో ఊహలు. ఇవే.. ఇలాంటివే మనిషి మెదడుకు చాలా ఇష్టం. ఆ వార్త నిజమా? కాదా అనేది ఆ తర్వాత. ముందు ఆ వార్త చూడగానే ఏదో కొత్త విషయం తెలుసుకుంటున్నామన్న ఎగ్జైట్‌మెంట్. ఆ వార్త గురించి కళ్లు మరింత వెతుకుతాయి. మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తుంది. ఇంతకి దీనంతటికి కారణం ఏంటో తెలుసా? మన మెదడే. ఇలాంటి వార్తలు కనిపించగానే సడెన్‌గా బుర్ర యూ టర్నర్ తీసుకుంటుంది. గిర్రున ఆలోచనలతో తన పని మొదలు పెడుతుంది.

ఆ వార్త నిజమా? అబద్దమా? అనేది అవసరం లేదు
మనిషి మెదడుకు నిత్యం ఆసక్తికరమైన అంశాలే ముఖ్యం. నిజం చెప్పాలంటే అలాంటివి అంటేనే చాలా ఇష్టం. చాలా మందికి ప్రాణం కూడా. ఆ వార్తలు కనిపించగానే వెంటనే దాని చదివేస్తుంటాడు. అది నిజామా? అబద్దమా అన్నది తర్వాత తెలుసుకుందాం.. ముందు ఆ వార్త సంగతి ఏంటో చూసేద్దాం అని బుర్రలో ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా సినిమా, రాజకీయ, క్రైమ్ అంశాల గురించి తెలుసుకోవాలని నెట్టింట్లో తెగ వెతికేస్తుంటాడు.

దీనంతటికి కారణం మనిషి మెదడులోని కొన్ని భాగాలే:
అయితే దీనంతటికి కారణం మరేదో కాదు మనిషి మెదడులోని కొన్ని భాగాలే. ఫేక్ వార్తలు కనబడగానే మనిషి మెదడులో జరిగే కొన్ని చర్యలే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం మనిషి మెదడు మూడు భాగాలుగా విభజించారు. మొదటిది మస్తిష్కం. ఈ మస్తిష్కం మళ్లీ రెండు బాగాలుగా చేయబడుతోంది. మస్తిష్కంలో ఉన్న ఈ రెండు బాగాలు వినడం, చూడటం, మాట్లాడటం, జరిగిన దానిని నెమరు వేసుకోవడం, భావోద్వేగాలను కంట్రోల్ చేయడం వంటివి చేస్తుంది. రెండో బాగమైన సెరెబెల్లమ్ మనిషి కండరాలను సమన్వయం చేస్తూ పని చేస్తుంది. ఇక మూడోది మెదడు వ్యవస్థ. ఇది మస్తిష్కాన్ని, సెరెబెల్లమ్‌ను సమన్వయం చేసుకుంటూ నాడీ వ్యవస్థ, వెన్నుముక, ఊపిరి పీల్చుకోవడం, నిద్ర, దగ్గు, తుమ్ములు ఇలా అనేక రకాల చర్యలు చేయడానికి ఉపయోగ పడుతుంది.


https://10tv.in/oppo-to-introduce-concept-smartphone-with-rollable-display/
మస్తిష్కంలోని కుడి, ఎడమ అర్థగళాల్లో ఒక్కోటి నాలుగు భాగాలుగా విభజించబడింది. ఆదేశాలు ఇవ్వడం, నొప్పి, బాధ, స్పర్శ, వేడి, చూపు, కలర్, వెలుగు వంటి వాటిని కలిగిస్తుంటాయి. కాగా మనిషి మెదడు చాలా వరకు బద్దకంగా ఉంటుంది. కానీ తన కంటికి ఏదైనా కొత్త విషయం, లేదా కొత్త సంఘటన కనిపించగానే వెంటనే మెదడు కొన్ని రకాల సిగ్నల్స్ పంపిస్తుంది. అది ఆసక్తికరమైన విషయం అయితే వెంటనే మెదడులో కెమికల్ రియాక్షన్ జరిగి దానిని భద్రంగా స్టోర్ చేసి పెడుతుంది. మళ్లీ అలాంటి సంఘటనలు ఎదురుపడగానే.. అరె గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా అని గతాన్ని గుర్తుకు వచ్చేలా చేస్తుంది.

ఫేక్ న్యూస్‌ను వెంటనే తీసుకునే బుర్ర:
మనిషి బుర్ర ఫేక్ న్యూస్‌ను కూడా వెంటనే తీసుకుంటుంది. ఆ వార్త నిజమా? కాదా అనేది తేల్చకోకముందే బుర్ర దానిని భద్రపరుస్తుంది. ముఖ్యంగా అతిగా ఎక్కువ ప్రచారం జరిగిన వార్తలను ఇట్టే సేకరించి పెట్టుకుంటుంది. అయితే ఆ వార్త గురించి మరేదైనా సమాచారం వచ్చినా, లేదా దాని గురించి అసలు నిజం తెలుసుకున్నా.. మనిషి బుర్ర మాత్రం అతిగా జరిగిన ప్రచారాన్ని మాత్రమే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది.

మనిషి మెదడు సోమరితనంలో ఉంటుంది:
కొన్ని వార్తలు వచ్చినప్పుడు మనిషి బుర్ర లాజిక్‌ని కూడా మర్చిపోతుంది. ఎందుకంటే మనిషి దేని గురించైనా, లేదా ఒక వ్యక్తి గురించైనా ముందు ఒక అభిప్రాయానికి వస్తే.. ఆ తర్వాత ఎన్ని సంఘటనలు జరిగినా అదే అభిప్రాయంలో ఉంటాడు. ఆ వ్యక్తి గురించి వచ్చే ఏ వార్త గురించి అయినా తన అభిప్రాయాన్నే ముందుగా విశ్వసిస్తాడు. కొన్ని సందర్బాల్లో మనిషి ఆలోచన వాస్తవానికి దూరంగా అమాయకంగా ఉంటుంది. నిజమైన వార్తలను కూడా ఫేక్ అని నమ్ముతుంటాడు. ఇటు మోటివేట్ చేసే మనుషులు చెప్పే వార్తలను కూడా మనిషి గుడ్డిగా నమ్మి ఫాలో అవుతుంటాడు. దానిలో నిజం ఎంత, అబద్దం ఎంత అని ప్రశ్నించుకోకుండా ముందుకు వెళ్తుంటాడు. కాగ్నిటివ్ బయాస్ సిద్ధాంతం ప్రకారం మనిషి మెదడు సోమరితనంలో ఉంటుంది. ఏదైనా కొత్త అంశం వచ్చినప్పుడు మన మెదడు దానిని పూర్తిగా ఫిల్టర్ చేయడానికి ప్రయత్నించదు.

ఫేక్ వార్తలను నమ్మకుండా ఉండటానికి మార్గాలు:
మరి ఈ ఫేక్ వార్తలను నమ్మకుండా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏదైనా ఒక వార్త వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, అది నిజమా? కాదా అనే అంశాలను పరిశీలించాలి. ముఖ్యంగా ఆ వార్త వచ్చి విధానాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే నమ్మాలి. హైప్ క్రియేట్ చేసేలా ఉన్న హెడ్ లైన్స్ ఆధారంగా వార్తను నమ్మకూడదు. అలాంటి వార్తల్లో అసలు కన్నా ఫేక్ న్యూసే ఎక్కువగా ఉంటుదని అర్థమవుతూనే ఉంది.

10TV Telugu News