నార్త్ ఇండియాకు ఆల్కహాల్ తీసుకోవద్దని చెబుతున్న వాతావరణ శాఖ.. ఎందుకలా!!

నార్త్ ఇండియాకు ఆల్కహాల్ తీసుకోవద్దని చెబుతున్న వాతావరణ శాఖ.. ఎందుకలా!!

దేశ రాజధాని ఢిల్లీతో పాటు నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే అంచనా వేసింది వాతావరణ శాఖ. ఈ మేరకు ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్ప మెంట్ కొత్త సూచనలు ఇచ్చింది. ఉత్తర భారతదేశంలో ఉండే వారిని దాదాపు ఆల్కహాల్ ముట్టుకోవద్దని చెప్పింది. ఐఎండీ కథనం ప్రకారం.. హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో డిసెంబర్ 29నుంచి చలిగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది.

గరిష్ఠంగా 3నుంచి 5డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రత ఉండబోతుంది. వీటి కారణంగా ఫ్లూ, నీరు గారే ముక్కు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దాంతో పాటు ఈ పరిస్థితికి చర్మం పగలడం, కఠినంగా మారడంతో పాటు నల్లని చారలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చలి గాలులకు పుట్టే వణుకు అనుకుని లైట్ గా తీసుకోకండి అది మరేదైనా కావొచ్చు.. శరీరంలో వేడి పోకుండా సరైన భద్రతాచర్యలు తీసుకోవాలని చెప్తుంది వాతావరణ శాఖ.

చలివాతావరణంలో ఆల్కహాల్‌కు లింకేంటి?
చలికాలం రాత్రి సమయంలో చిల్ అవుదామని అంతా అనుకుంటారు. అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆల్కహాల్ మీకు వెచ్చని ఫీలింగ్ కల్పించొచ్చు. కానీ, అది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిస్తుంది.

థర్మల్ ఫిజియాలజీ, యూఎస్ ఆర్మీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో ఈ విషయం తేలింది. ఆల్కహాల్ శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు హైపోథెర్మియా రిస్క్ ను పెంచుతుంది.

హైపోథెర్మియా కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత జనరేట్ అవకముందే కోల్పోతాం. ఫలితంగా టెంపరేచర్ అనేది ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. సాధారణ ఉష్ణోగ్రత 37డిగ్రీల సెల్సియస్ గా ఉంటే.. హైపోథెర్మియాతో బాధపడేవారి ఉష్ణోగ్రత 35డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటుంది. దీని సాధారణ లక్షణాలు వణుకురావడం, శ్వాస ఎక్కువగా అందకపోవడం, మాట తడబడటం, చల్లని చర్మం, నీరసం వంటివి.

ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హైపోథెర్మియా రిస్క్ పెరిగిపోవడంతో పాటు సైకలాజికల్ గా, ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయి. ఫలితంగా వ్యక్తిగత సామర్థ్యం కూడా తగ్గే ప్రమాదం ఉంది.

ఆల్కహాల్ శరీరంలో ఉష్ణోగ్రత ఎలా తగ్గిస్తుంది:
ఆల్కహాల్ రక్త కణాలు ఓపెన్ అయ్యేలా చేసి రిలాక్స్ చేస్తుంది. దాంతో చర్మంపైన పొరల్లోకి రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేస్తుంది. అది మనకు వేడిగా అనిపించొచ్చు కానీ, చర్మం అప్పుడే చెమట పుట్టడం మొదలుపెడుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఐఎండీ సమాచారం ప్రకారం.. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఆదివారం వరకూ ఉష్ణోగ్రత 3నుంచి 5డిగ్రీల సెల్సియస్ గానే ఉంటుంది. హిమాలయ ప్రాంత పరిధిలో ఉన్న ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీఘడ్ సోమవారం నుంచి టెంపరేచర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.