అప్పు కట్టేస్తానంటే.. మోడీ ఎందుకు తీసుకోరు : మాల్యా మళ్లీ పేలాడు

అప్పు కట్టేస్తానంటే.. మోడీ ఎందుకు తీసుకోరు : మాల్యా మళ్లీ పేలాడు

16వ లోక్ సభలో బుధవారం(ఫిబ్రవరి-13,2019)  ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన చివరి ప్రసంగంపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా స్పందించారు. మోడీ తన ప్రసంగంలో 9వేలకోట్లతో దేశం విడిచిపారిపోయిన వ్యక్తి అని పరోక్షంగా తన పేరు ప్రస్తావించడంపై గురువారం(ఫిబ్రవరి-14,2019) ట్విట్టర్ వేదికగా స్పందించిన మాల్యా..నేను ఆఫర్ చేసిన డబ్బును తీసుకోవాలని బ్యాంకులకు మోడీ ఎందుకు సూచించడంలేదు. నేను ఆఫర్ చేసిన డబ్బును తీసుకోమని బ్యాంకులకు సూచించి ఉంటే అతను కనీసం కింగ్ ఫిషర్ కి ఇచ్చిన అప్పులన్నీ రికవరీ చేశామన్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవచ్చు.  

కర్ణాటక హైకోర్టు సమక్షంలో తాను బాకీ ఉన్న మనీ సెటిల్ చెస్తానని ఆఫర్ చేశానని, ఇది ఒక పనికిమాలినదిగా కొట్టిపడేయకూడనిదని మాల్యా తన ట్వీట్ లో తెలిపారు.ఇది ఖచ్చితంగా పరిగణించబడేదని అన్నారు.కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కి అప్పుగా ఇచ్చిన మనీని బ్యాంకులు ఎందుకు తీసుకోలేదంటూ మాల్యా ప్రశ్నించారు.అంతేకాకుండా తన దగ్గర ఇంకా దాచి ఉంచిన డబ్బు ఉందని వస్తున్న ఆరోపణలను మాల్యా ఖండించారు.

తన దగ్గర ఎటువంటి హిడెన్ వెల్త్ లేదని తెలిపారు. తన దగ్గర దాచి ఉంచిన సంపదే ఉండి ఉంటే దాదాపు 14వేల కోట్ల విలువైన ఆస్తులను ఓపెన్ గా కోర్టు ముందుల ఎలా పెట్టగలిగేవాడినని ప్రశ్నించారు.మాల్యాను భారత్ కి అప్పగించేందుకు ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మాల్యాని ఉంచేందుకు ముంబైలోని జైళ్లో ఓ ప్రత్యేక సెల్ ని కూడా అధికారులు రెడీ చేశారు.