ఉస్సేన్ బోల్ట్‌ తో కంబాలా రేసర్ కు పోలికెందుకు? ఇది మన ఒరిజినల్ టాలెంట్

ఉస్సేన్ బోల్ట్‌ తో కంబాలా రేసర్ కు పోలికెందుకు? ఇది మన ఒరిజినల్ టాలెంట్

వరల్డ్ చాంపియన్ స్ప్రింటర్.. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌ను వెనక్కునెట్టేశాడంటూ శ్రీనివాస్ గౌడను పైకెత్తేశారు. అతనేమో తన వల్ల కాదంటూ స్పింటర్ రేసును సున్నితంగా చెప్పేశాడు. ఈ రికార్డు ప్రపంచమంతా తెలిసేలోపే మరో వ్యక్తి శ్రీనివాస్ రికార్డును దాటేశాడు. 0.4 సెకన్లు ముందుగానే ఆ రికార్డును దాటేశాడు. శ్రీనివాస్‌ను.. కొత్త కంబాలా రేసర్ నిశాంత్ శెట్టిని ఉస్సేన్ బోల్ట్‌తో పోల్చగలమా.. వాళ్లలో పోలికలు ఏం ఉన్నాయో.. ఓ సారి చూద్దాం.

కర్ణాటకలో జరిగిన కంబాలా రేసు విన్నర్ శ్రీనివాస్ గౌడకు రూ.3లక్షల ప్రైజ్ మనీ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. కేంద్ర మంత్రి పిలుపు మేరకు శ్రీనివాస్‌ను  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్‌కు పంపారు. ఈ పరుగు పందేలు నాకొద్దు బాబోయ్ అంటూ గౌడ వెనక్కు వచ్చేయడానికి ముందు.. అక్కడ ఏం జరిగిందంటే..

 

మంత్రి చెప్పినట్లుగానే శాయ్.. ట్రయల్స్ నిర్వహించింది. కానీ, అందులో పాల్గొన్న ప్లేయర్ల కంటే 100 మీటర్ల పరుగును ఈ స్టార్ కంబాలా రేసర్.. చివర్లో పూర్తి చేశాడట. కంబాలా రేసులో చూపించిన వేగం కంటే దాదాపు చాలా రెట్లు వెనకబడిపోయాడు. 

‘కంబాలా రేసు అనేది నాలుగు కాళ్ల జంతువులతో సమన్వయంతో జరిగేది. దానికి ఎంతో అనుభవం కావాలి. ఉస్సేన్ బోల్ట్‌ను తీసుకొచ్చి కంబాలా రేసులో పార్టిసిపేట్ చేయమంటే శ్రీనివాస్‌లా పరిగెత్తలేడు. అతను 15సంవత్సరాల వయస్సు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ రికార్డు సాధించడానికి ముందు వంద రేసుల్లో పార్టిసిపేట్ చేశాడు. అలాగే శ్రీనివాస్ గౌడను 100మీటర్ల ట్రాక్‌లో పరిగెత్తమంటే అతని వల్ల కాదు’ అని కంబాలా రేసు ప్రెసిడెంట్ కాదంబ అన్నారు. 

కంబాలా రేసు.. ట్రాక్ మీద పరిగెత్తడమనేది పూర్తిగా విరుద్ధం. దున్నపోతులతో పాటు పరిగెత్తేడప్పుడు జాకీలు కేవలం ముని వేళ్లతో పరిగెడతారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు శ్రీనివాస్ గౌడకే కాదు. గతంలోనూ ఇలా ఒకరికి అవకాశమిచ్చారు. 2019లో మధ్య ప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్ గుజ్రార్ వైరల్ వీడియో చూసి అతనికీ అవకాశమిచ్చారు. 

100మీటర్ల దూరాన్ని 11సెకన్లలో చేరుకోవడం చూసి భోపాల్‌లోని శాయ్ సెంటర్‌కు పిలిచ ట్రయల్స్‌కు అవకాశం కల్పించారు. పబ్లిసిటీ పోతుందేమోననే భయంతో అతను పర్‌ఫార్మ్ చేయలేకపోయాడు. ఇంకా ప్రాక్టీస్ ఇప్పిస్తామని మాటిచ్చినా అతను పట్టించుకోలేదు. 

శ్రీనివాస గౌడను సైతం 0.4సెకన్ల ముందే దాటేసిన నిశాంత్ శెట్టి పరిస్థితి ఇప్పుడేంటి? కర్ణాటక ముఖ్యమంత్రి నిశాంత్‌ను సైతం ట్రయల్స్ అవకాశం కల్పిస్తారు. అతను ట్రయల్స్‌లో సక్సెస్ అయితే ట్రైనింగ్ తీసుకుని చాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ఒలింపిక్స్ టోర్నీ 100మీ ఈవెంట్లో భారత్ తరపున 1980 తర్వాత ఒక్కరూ ప్రాతినిధ్యం వహించలేదు. అందులో పోటీ చేసిన అడిలె సుమరీవాలానే ప్రస్తుత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

నిశాంత్ శెట్టి – 9.51
ఉసేన్ బోల్ట్ – 9.58
శ్రీనివాస్ గౌడ – 9.55

Read More>> పర్యటనకు ముందే….భారత్ కు ట్రంప్ బ్యాడ్ న్యూస్