Monsoon : రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? వ్యవసాయం, ఎకానమీపై ఎలాంటి ప్రభావం పడనుంది?

రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? లోటు వర్షపాతానికి కారణం ఏంటి? వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుంది?

Monsoon : రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? వ్యవసాయం, ఎకానమీపై ఎలాంటి ప్రభావం పడనుంది?

Monsoon

Monsoon : గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ప్రారంభ-వర్షాకాలం తక్కువే. అనుకున్న స్తాయిలో వర్షాలు కురవలేదు. దేశం మొత్తం వర్ష మేఘాలు అలుముకున్నాయి. అయినప్పటికి వర్షపాతం లోటు కనిపిస్తోంది. పడాల్సిన స్థాయిలో వానలు పడలేదు. ఇది వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించే అంశం.

కొంచెం ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. గత నెల మధ్యకాలం వరకు దేశంలో ప్రయాణించాయి. జూన్ 13 నాటికి రుతుపవనాలు వాయవ్య భారతదేశం మినహా దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేశాయని IMD తెలిపింది. వాయవ్య భారతదేశంపై గాలులు బలహీనపడటానికి దారితీసింది. జూలై 13 నాటికి నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో మరింత విస్తరించాయి. అయితే బే ఆఫ్ బెంగాల్ నుండి తేమతో కూడిన గాలులు దిగువ స్థాయిలో కొనసాగడం ప్రభావం చూపింది.

జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా బలహీనమైన రుతుపవనాల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా వర్ష మేఘాల పురోగతిని ప్రభావితం చేసిందన్నారు. బే ఆఫ్ బెంగాల్ పై అల్పపీడన ప్రాంతం ఏర్పడటం ఒక కారణం కాగా, ఢిల్లీ సమీపంలో సముద్ర మట్టంలో రుతుపవనాల కదలిక లేకపోవడం కూడా మరో కారణం.

జూన్ 1 నుంచి జూలై 19 మధ్య వివిధ జిల్లాల్లో వర్షపాతం నమోదైన వివరాలు. మొత్తం 693 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 287 జిల్లాల్లో (42 శాతం) లోటు వర్షపాతం నమోదైంది. ఇక 84 జిల్లాలు.. వాటిలో ఎక్కువ భాగం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి. “అధికంగా” వర్షపాతం నమోదైంది. మరోవైపు, మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్ లలో 247 జిల్లాల్లో సగానికి పైగా వర్షపాతం నమోదైంది.

రుతుపవనాలు మందగించడం వల్ల ఈ ఏడాది మొత్తం విత్తనాల విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 10 శాతానికి పైగా క్షీణించింది. 2021 లో ఇప్పటివరకు రైతులు వేసవి పంటలో 49.9 మిలియన్ హెక్టార్లు సాగు చేశారు. ప్రధాన వేసవి పంట బియ్యం, జూలై 9 వరకు 11.5 మిలియన్ హెక్టార్లకు పైగా సాగు చేశారు. అంతకుముందు సంవత్సరంలో ఇది 12.6 మిలియన్ హెక్టార్లలో ఉంది. చెరకు పంట విస్తీర్ణం మారలేదు. 2020 లో 5.3 మిలియన్ హెక్టార్లుగా ఉంది.

మన దేశంలో మొత్తం వ్యవసాయ భూముల్లో సగం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. ఇది వార్షిక వర్షపాతంలో 70-90 శాతం ఉంటుంది. అసలే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడు లోటు వర్షపాతం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. పేలవమైన వర్షపాతం భారతదేశ ఆర్థిక పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశం యొక్క 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం 15-18 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది. లోటు లేదా ఆలస్య వర్షపాతం ద్రవ్యోల్బణం పై ప్రభావం చూపనుంది.