Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు? దీని వల్ల టెలికామ్ కంపెనీలకు ఎంత లాభం

టెలికాం ఆపరేటర్లు "నెలవారీ" ప్రీపెయిడ్ ప్లాన్‌లను 30 రోజులకు కాకుండా 28 రోజులకు ఎందుకు అందిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?

Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు? దీని వల్ల టెలికామ్ కంపెనీలకు ఎంత లాభం

Mobile Recharge : టెలికామ్ ఆపరేటర్లు “నెలవారీ” ప్రీపెయిడ్ ప్లాన్‌లను 30 రోజులకు కాకుండా 28 రోజులకు ఎందుకు అందిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? నెలవారీ ప్లాన్‌ని ఎంచుకునే సబ్‌స్క్రైబర్‌లు వారు అనుకున్నట్లుగా 12 సార్లు కాకుండా సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది.

చదవండి : Xiaomi Mi 12 Pro : రిలీజ్‌కు ముందే 2 లక్షల బుకింగ్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

దీని వెనుక పెద్ద కథే ఉంది. 30 రోజులకు బదులుగా 28 రోజులకు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడం ద్వారా ఈ టెలికాం కంపెనీలు భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.

చదవండి : Mobile Addiction : ద్యావుడా.. ఫోన్‌కు బానిసగా మారి గతం కూడా మర్చిపోయాడు

ఎలాగో ఇప్పుడు చూద్దాం.

12 నెలల x 28 రోజుల వ్యాలిడిటీ 336 రోజులకు వస్తుంది. అంతే 365 రోజులు / సంవత్సరానికి 29 రోజులు తక్కువ. మనం చేసే రీఛార్జ్‌లో 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. మిగతా 29 రోజులకు మరో రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 13 సార్లు నెలవారీ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 13వ రీఛార్జ్‌లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు కోట్లాది రూపాయల డబ్బును ఆర్జించారని తెలిస్తే మనం ఆశ్చర్యపోతారు.

చదవండి : Flipkart Mobiles: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

13వ రీఛార్జ్‌లో, Airtel దాదాపు రూ. 5415 కోట్లు సంపాదిస్తుంది. ఇదే లెక్కతో, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా 13వ నెలలో వరుసగా రూ.6168 కోట్లు, రూ.2934 కోట్లు ఆర్జించాయి.

చదవండి : Recharge: రీచార్జీల మోత.. ఎయిర్‌టెల్‌ రూట్‌లోనే వొడాఫోన్‌ ఐడియా!

ఇక మనం మూడు నెలలకు రీచార్జి చేసుకున్నా.. 90 రోజులకు బదులుగా 84 రోజుల చెల్లుబాటును అందించే త్రైమాసిక ప్లాన్‌లకు కూడా ఇదే లెక్క వర్తిస్తుంది. త్రైమాసిక ప్లాన్‌లను తీసుకునే సబ్‌స్క్రైబర్‌లు నాల్గవ రీఛార్జ్‌పై సంవత్సరానికి 29 రోజులు మిగిలి ఉన్న 336 రోజుల సేవను మాత్రమే పొందుతారు.