Navneet Kaur: ఒకప్పటి తెలుగు హీరోయిన్ నవనీత్ రానాకు వై కేటగిరి సెక్యురిటీ ఎందుకు? శివసేనతో ఆమెకున్న గొడవేంటి?

తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, జాబిలమ్మ, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్‌‌గా నటించి మంచి పేరుతెచ్చుకున్న నవీన్ కౌర్ తెలుగు వారికి సుపచితురాలే. పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె రాజకీయాలకు పరిమితం అయ్యారు....

Navneet Kaur: ఒకప్పటి తెలుగు హీరోయిన్ నవనీత్ రానాకు వై కేటగిరి సెక్యురిటీ ఎందుకు? శివసేనతో ఆమెకున్న గొడవేంటి?

Navaneet Kuar

Navneet Kaur: తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, జాబిలమ్మ, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్‌‌గా నటించి మంచి పేరుతెచ్చుకున్న నవీన్ కౌర్ తెలుగు వారికి సుపచితురాలే. పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె రాజకీయాలకు పరిమితం అయ్యారు. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవిరానాను వివాహం చేసుకొని నవనీత్ రానా మారిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆమె ఎంపీగా ఎన్నికైన తరువాత లోక్‌సభలో పలుమార్లు తెలుగులో మాట్లాడారు. తాను సభలో ప్రసంగిస్తున్నప్పుడు తెలుగు ఎంపీలు అడ్డుకున్నప్పుడు.. సభాధ్యక్ష స్థానంలో తెలుగు ఎంపీ ఉన్నప్పుడు ఆమె వారితో తెలుగులోనే సంభాషించి నేను తెలుగు నేపథ్యం కలిగిన దానినే అని తెలిపారు.

Tirumala : శ్రీవారి సేవలో ఎంపీ నవనీత్ కౌర్..తప్పుడు కేసులు పట్టించుకోను..ప్రజాసేవే నా లక్ష్యం

ఇటీవలి కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో రవిరానా దంపతుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబరులో త్రిపురలో మొదలైన ఘర్షణల ప్రభావం అమరావతిలోనూ కనిపించింది. రానా దంపతులు ప్రతిష్ఠించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. ఈ విషయాన్ని ఆమె లోక్‌సభ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాజాగా ఆమె మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతుండటంతో ఆ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారంపై ఆసక్తి ఏర్పడింది. నవీన్ రానాకు శివసేనకు గొడవేంటి అన్నవిషయాన్ని తెలుసుకొనేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే మాతోశ్రీ ( సీఎం ఉద్దవ్ నివాసం)కి వచ్చి నిరసన చేపడతానని నవనీత్ రానా చెప్పడం ఇదేమీ తొలిసారి కాదు. 2020 దీపావళి సమయంలో విదర్భకు చెందిన రైతులతో కలిసి మాతో శ్రీ ఎదుట నిరసన చేపడతానని ఆమె చెప్పారు. అయితే, అమరావతికి వెళ్లముందే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Bombay HC: ఎంపీ నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు..రూ.2 లక్షలు జరిమానా

ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే హనుమాన్ జయంతి రోజున మాతో శ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని నేను డిమాండ్ చేస్తున్నానని, కానీ ముఖ్యమంత్రి ఆ పని చేయలేరని నవనీత్ రానా వ్యాఖ్యానించారు. అలాచేస్తే ఆయన కూటమిలోని కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోతాయని ఆయనకు భయం అని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే తామే ఠాక్రే నివాసం వద్దకు చేరుకొని శనివారం తప్పకుండా నేను, నా భర్త హనుమాన్‌ చాలీసాను చదువుతామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సహకరిస్తామని శుక్రవారం నవనీత్ రానా చెప్పారు. ఇదిలా ఉంటే అంతకన్నా ముందు పోలీసులు వారి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దంటూ వారికి సూచించారు. ఈ వివాదం నేపథ్యంలో రానా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రంట్‌ ముచ్చట్లు, మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

భాజపా కుట్రలో భాగంగానే వారు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. శివసేనను సవాల్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. దీంతో మహారాష్ట్ర లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమరావతి ఎంపీ నవీనత్ రానాకు వీఐపీ భద్రత కల్పించింది కేంద్రం. నవనీత్ రానా భద్రతకు ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రత్యేక సిఫార్సులను ఆమోదించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత వారం పారామిలటరీ సాయుధ కమాండోలతో భద్రత కల్పించినట్లు తెలిపారు. నవనీత్ కు ముగ్గురు నుంచి నలుగురు సీఐఎస్ఎఫ్ సాయుధ కమాండోలు భద్రత కల్పించేలా వై కేటగిరీ సెంట్రల్ కవర్ ను పొందనున్నారు. అయితే ఆమె అన్నట్లు శనివారం మతాశ్రీ ఎదుట నవీనత్ రానా దంపతులు ఏమేరకు హనుమాన్ చాలీసా చదువుతారు, పోలీసుల అడ్డంకులను ఎదుర్కొని వారు వెళ్లగల్గుతారా అనేది చూడాల్సి ఉంది.