Uttar Pradesh : భర్తను అరెస్టు చేయించాలని భార్య కన్నింగ్ ప్లాన్..చివరికి

ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.

Uttar Pradesh : భర్తను అరెస్టు చేయించాలని భార్య కన్నింగ్ ప్లాన్..చివరికి

Wife

Wife Cunning Plan : అనుమానాలు సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. పచ్చని కాపురాలు నిలువునా కూలిపోతున్నాయి. భర్తపై భార్య అనుమానం..భార్యపై భర్త అనుమానాలతో నిత్యం ఏదో ఒక కుటుంబంలో కొట్లాటలు జరుగుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు సైతం తీసేయడానికి వెనుకంజ వేయడం లేదు. ఇలాగే..ఓ భర్తపై అనుమానం పెంచుకుంది భార్య. ఇతడిని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని కన్నింగ్ ప్లాన్ వేసింది. కానీ..ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది. అయితే..భర్త తరచూ ఇంటికి ఆలస్యంగా రావడంతో భార్య అనుమానం పెంచుకుంది. ఒక్కో రోజు ఇంటికి రాకపోవడంతో అనుమానం మరింతగా బలపడింది. ఎలాగైనా భర్తపై ప్రతికారం తీర్చుకోవాలని ఉద్దేశ్యంతో ఓ ప్లాన్ వేసింది. ఢిల్లీకి చెందిన పవన్ అనే వ్యక్తితో 700 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసింది. దీనిని భర్త ఆటోలో దాచిపెట్టింది. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు పోన్ చేసి చెప్పింది. దర్యాప్తులో భాగంగా..ఆమెపై అనుమానం కలిగింది. ఆమెను సుదీర్ఘంగా విచారించడంతో..తానే గంజాయిను ఆటోలో ఉంచినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. భర్తను అరెస్టు చేయిద్దామనుకున్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆమెనే కటకటలాపాలైంది.

Read More : China : బ్యాగులో ఉన్న ఫోన్ పేలి..మంటలు, వైరల్ వీడియో