Supreme Court: ‘నా భార్య అసలు ఆడదే కాదు విడాకులిప్పించండి’

తాను మూడు ముళ్లు కట్టి వివాహం చేసుకున్న భార్య అసలు మహిళే కాదని తెలిసి సుప్రీం కోర్టు మెట్లెక్కాడో వ్యక్తి. 'విడాకులు ఇప్పించండి బాబు' అని మొరపెట్టుకుంటుండటంతో వీలైంనతం త్వరగా ..

Supreme Court: ‘నా భార్య అసలు ఆడదే కాదు విడాకులిప్పించండి’

Supreme Court

Supreme Court: తాను మూడు ముళ్లు కట్టి వివాహం చేసుకున్న భార్య అసలు మహిళే కాదని తెలిసి సుప్రీం కోర్టు మెట్లెక్కాడో వ్యక్తి. ‘విడాకులు ఇప్పించండి బాబు’ అని మొరపెట్టుకుంటుండటంతో వీలైనంత త్వరగా పరిష్కరించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.

జస్టిసెస్ సంజయ్ కిషన్ కౌల్, ఎమ్ఎమ్ సుందేశ్ లు మధ్యప్రదేశ్ హైకోర్టులో జులై 29న వేసిన పిటిషన్ ను ఛాలెంజ్ చేస్తూ రిప్లై ఇవ్వాలని భార్యను ఆదేశించారు.

ఆమెలో అసంపూర్ణ హైమెన్‌తో పాటు పురుషాంగం కూడా ఉన్నట్లు మెడికల్ హిస్టరీలో తెలిసిందని, ఈ సాక్ష్యాలను బట్టి మహిళే కాదంటూ తన భర్త వేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లో రెస్పాండ్ కావాలని నోటీసులు పంపింది సుప్రీం కోర్టు.

2016లో వివాహం చేసుకున్న కొద్ది రోజుల వరకూ అత్తారింటికి రాలేదు. మెన్‌స్ట్రుయేటింగ్ పీరియడ్‌లో ఉన్నానని దూరంగా ఉంటూ ఆరు రోజుల తర్వాత తిరిగొచ్చింది. భార్యకు దగ్గరవ్వాలని చూసేసరికి ఆమెకు సహజంగా ఉండాల్సిన మర్మాంగం కనిపించలేదు.

Read Also : ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే..దంపతులు విడాకులు తీసుకుంటున్నారు : మాజీ సీఎం భార్య వ్యాఖ్యలు

అక్కడ చిన్నపిల్లలకు ఉండే పరిమాణంలో పురుషాంగం కనిపించడంతో షాక్ అయ్యానంటూ పిటిషన్ వేసే సమయంలో లాయర్ కు వివరించాడు.

మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లి పరీక్షలు చేయించగా.. పురుషాంగంతో పాటు అసంపూర్ణ హైమెన్ ఉన్నట్లు తెలిసింది. దాని కారణంగా మహిళలకు ఉండే మర్మాంగం కప్పబడి ఉందని రిపోర్టుల్లో స్పష్టమైంది. తనను మామ మోసం చేశాడని, కూతుర్ని ఇంటికి తీసుకుపొమ్మంటూ భార్య తండ్రికి ఫోన్ చేసి చెప్పాడట.

మెడికల్ సర్జరీతో కండిషన్ మెరుగవుతుందని తన భార్య సర్ది చెబుతుందని, డాక్లర్లు దీనిపై రెస్పాండ్ అయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తేల్చేశారని వాపోతున్నాడు.

Read Also : భర్త చేసుకోబోయిన మూడు పెళ్లిళ్లను అడ్డుకున్న భార్య

పిటిషన్ ప్రకారం.. నా భార్య సర్జరీ చేయించుకుని నా దగ్గరకు వచ్చింది. తన కూతురితో వివాహ బంధం కొనసాగించాలంటూ మామ తరపు నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ ఆరోపిస్తున్నాడు పిటిషనర్. పోలీసులకు కంప్లైంట్ చేసి తనకు విడాకులు కావాలని మొరపెట్టుకుంటున్నాడు.