Kerala : కేరళ వరదల్లో చిక్కుకున్న గజరాజు..చివరికి…

నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు,వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

Kerala : కేరళ వరదల్లో చిక్కుకున్న గజరాజు..చివరికి…

Kerala :  నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు,వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలకుడి నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. నది మధ్యలో ఒక ఏనుగు నీటిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

నది మధ్యలో చిక్కుకుపోయిన ఏనుగు రక్షించేందుకు అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ క్రమంలో వరద ఉధృతికి ఏనుగు కొద్ది దూరం కొట్టుకు పోయింది. ప్రవాహం మధ్యలో విరిగిపోయిన చెట్టును తొండం సహాయంతో పట్టుకుంది. అనంతరం క్రమంగా నది అవతలి వైపునకు చేరుకుంది. ఆ తర్వాత ఏనుగు జాడ కనిపించకుండా పోయింది.

అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. సమీపంలోని గ్రామంలోకి ఆహారం కోసం వెళ్లి.. తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో ఏనుగు నదిలో చిక్కుకుపోయి ఉంటుందని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.