Bharat Jodo Yatra: రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటానంటున్న బీజేపీ నేత.. కాకపోతే ఒక్క షరతు!

కాంగ్రెస్ ప్రధాన వైరి పక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆ పార్టీకి చెందిన ఒక నేత ఈ యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత చార్య ప్రమోద్ కృష్ణమ్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా బుధవారం స్పందిస్తూ, తాను పాల్గొంటానని, అయితే ఒక్క షరతు మాత్రం అని అన్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటానంటున్న బీజేపీ నేత.. కాకపోతే ఒక్క షరతు!

Will be join Bharat Jodo Yatra says BJP leader in a Twitter exchange

Bharat Jodo Yatra: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పలు ప్రాంతీయ పార్టీల నేతలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. రాహుల్ సైతం అనేక మంది బీజేపీయేతర పార్టీలకు ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపుతున్నారు. దీనికి కొందరు సముఖంగా స్పందిస్తున్నారు, మరికొందరు విముఖత చూపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రధాన వైరి పక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆ పార్టీకి చెందిన ఒక నేత ఈ యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత చార్య ప్రమోద్ కృష్ణమ్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా బుధవారం స్పందిస్తూ, తాను పాల్గొంటానని, అయితే ఒక్క షరతు మాత్రం అని అన్నారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి షాకిచ్చిన మరో యూపీ నేత

ఇంతకీ ఆ షరతు ఎంటటా అంటే.. కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీ అని, టుక్‭డే-టుక్‭డే గ్యాంగ్ మద్దతు పార్టీ అనే విమర్శలు బీజేపీ ఎప్పటి నుంచో చేస్తోంది. ఇదే విషయాన్ని షెహజాద్ పూనావాలా లేవనెత్తుతూ, అలాంటి వారి ఈ యాత్రలో పాల్గొనడం లేదని తనకు హామీ ఇస్తే, తాను తప్పకుండా ఈ యాత్రలో పాల్గొంటానని అన్నారు. అంతే కాకుండా.. ఆవులను వధించేవారు, శ్రీరాముడి జననం, ఉనికిలను ప్రశ్నించేవారు ఈ యాత్రలో పాల్గొనకూడదని ఆయన షరతు విధించారు.

Uttarakhand: హల్ద్వానీలో గూడు కోల్పోనున్న 4,000 కుటుంబాలు.. ఎందుకో తెలుసా?

షెహజాద్ పూనావాలా అంతకుముందు ఆచార్య ప్రమోద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ స్పందిస్తూ, భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించారు. దీనిపై పూనావాలా స్పందిస్తూ ‘‘భారత దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవారు, పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు మద్దతిచ్చేవారు, హిందుత్వాన్ని ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చేవారు, ఆవులను వధించేవారు, రాముడి ఉనికి, జననాన్ని ప్రశ్నించేవారు, జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని అధికరణ 370ని పునరుద్ధరించాలని కోరేవారు ఈ యాత్రలో పాల్గొనకపోతే నేను కచ్చితంగా పాల్గొంటాను’’ అని రిప్లై ఇచ్చారు.