Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?

భారత్‌లో కూడా కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందా? ఇండియాలో ఫోర్త్ వేవ్ రావొచ్చా? ఈ విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ఈ అంశంపై స్పందించాడు.

Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?

Covid-19: చైనాలో కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఊహకందని స్థాయిలో అక్కడ కేసులు పెరిగిపోతుండటం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. ఈ అంశంపై భారత ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. చైనాలాగే భారత్‌లో కూడా కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందా? ఇండియాలో ఫోర్త్ వేవ్ రావొచ్చా?

DL Ravindra Reddy: వైసీపీలో ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది.. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

ఈ విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ఈ అంశంపై స్పందించాడు. ‘‘చైనాలో భారీగా పెరిగిపోతున్న కేసులపై మన దేశంలో ఆందోళన అవసరం లేదు. మనం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం వల్ల ఈ విషయంలో కంగారు పడక్కర్లేదు. మనం ప్రభుత్వ సూచనల్ని పాటిస్తే చాలు’’ అని పూనావాలా ట్వీట్ చేశారు. మరో కోవిడ్ విశ్లేషకుడు విజయానంద్ మాట్లాడుతూ ‘‘చైనాలో కోవిడ్ విజృంభణకు కారణం ఒమిక్రాన్ సబ్ వేరియెంట్స్ అయిన బీఏ.2.75, బీఏ.5,బీక్యూ.1,ఎక్స్‌బీబీ వంటి వేరియెంట్లు. ఇవి ప్రపంచమంతా ఇప్పటికే ఉన్నాయి. అందువల్ల చైనాలో విజృంభిస్తున్న వైరస్ ప్రభావం ఇండియాపైకానీ, ప్రపంచంపైకానీ పడే అవకాశం లేదు’’ అని చెప్పారు.

UNESCO : ప్రధాని మెడీ జన్మస్థలం వాద్‌నగర్‌తో పాటు భారత్‌లో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు..

మన దేశంలో ఇప్పటికే ఈ వేరియెంట్లను ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. గతంలో ఉన్న జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం ఎత్తివేయడం, లాక్ డౌన్ తొలగించడంతో అక్కడ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చైనాలో చాలా మంది మరణిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే అక్కడ 5241 మంది కోవిడ్ కారణంగా మరణించారు. లాక్ డౌన్ వల్ల చైనా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసింది.