Warn to Judge: సెప్టెంబరు13న చంపేస్తా,చేతనైతే తప్పించుకో..జడ్జికి వార్నింగ్ లేఖ

‘మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు.మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తా..చేతనైతే నానుంచి తప్పించుకో’ అంటూ ఓ వ్యక్తి జడ్జికి బెదిరింపు లేఖ రాశాడు.

Warn to Judge: సెప్టెంబరు13న చంపేస్తా,చేతనైతే తప్పించుకో..జడ్జికి వార్నింగ్ లేఖ

Anonymous Person Warning Letter To A Rajasthan Judge

Anonymous person Warning letter to a Rajasthan judge : ఝార్ఖండ్ జడ్డి ఉత్తమ్ ఆనంద్ ను కొంతమంది నడిరోడ్డుమీద ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసిందే. ఈ క్రమంలో ఓ అజ్ఞాత వ్యక్తి రాజస్థాన్ జడ్జిని బెదిరిస్తు ఓ లేఖ రాశాడు. మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ నాకు లేదు. మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తా..చేతనైతే నానుంచి తప్పించుకో అంటూ సవాల్ విసిరినట్లుగా లేఖ రాశాడు. సెప్టెంబర్ 13న మిమ్మల్ని తుపాకితో కాల్చి గానీ, విషమిచ్చి గానీ, వాహనంతో ఢీకొట్టి కానీ చంపేస్తాం..నేను పిరికివాడిని కాదు అందుకే మీకు ముందుగానే ఈ విషయం చెప్పి మరీ చంపుతా..ఇప్పటికే మిమ్మల్ని చంపుతాననే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాం అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి రాజస్థాన్ లోని బుండిలో జిల్లా సెషన్స్ జడ్జికి రాసిన లేఖలో పేర్కొనటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు జడ్జికి భద్రత పటిష్టం చేశారు.

బుండిలో జిల్లా సెషన్స్ జడ్జికి రాసిన సదరు వ్యక్తి రాసిన లేఖలో ‘‘మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అందుకే మాఫియా సహాయం తీసుకున్నా..మిమ్మల్ని సెప్టెంబరు 13న హత్య చేయాలని నిర్ణయించుకున్నా..మీ ఇంటిని బాంబులతో పేల్చేద్దామనుకున్నాను కానీ, మీ కుటుంబ సభ్యుల వల్ల నాకు హాని లేదు కాబట్టి ఆ ఆలోచన విరమించుకున్నాను. తుపాకితో కాల్చిగాని, విషమిచ్చి కానీ, వాహనంతో ఢీకొట్టి కానీ.. ఏదో రకంగా మిమ్మల్ని చంపేస్తా. కోర్టులో నిందితుడికి మీరు ఎలా అయితే అవకాశం ఇస్తారో..నేను కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి అవకాశం ఇస్తున్నాం. చేతనైతే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. పోలీసు బలగాలను కాపలా పెట్టుకుంటారో లేదా మరోరకంగా మీ ప్రాణాల్ని కాపాడుకుంటారో మీ ఇష్టం. మీమ్మిల్ని ఎలాగైనా అన్న తేదీకి చంపి తీరుతా..ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాం. చేతనైతే మిమ్మిల్నీ రక్షించుకోండి’’ అంటూ రాజస్థాన్‌లోని బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారికర్‌కు అజ్ఞాత వ్యక్తి ఒకరు లేఖ రాశాడు.

హిందీలో రాసిన ఈ లేఖలో జడ్జికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.గతంలో కూడా న్యాయమూర్తులకు ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. బూందీలోని మరో జిల్లా జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు వచ్చాయి.

జార్ఖండ్‌లో పట్టపగలు జడ్జి హత్య : జులై 28 న జార్ఖండ్‌లోని ధన్బాద్‌లో అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ నడిరోడ్డుమీద దారుణహత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఓ వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడినవారు ఇప్పటి వరకూ అరెస్ట్ అవ్వనేలేదు. ఈ హత్య న్యాయవ్యవస్థలే సవాల్ గా మారింది. దీంతో సుప్రీంకోర్టు జడ్జి ఉత్తమ్ కుమార్ హత్యపై సిబిఐ విచారణకు ఆదేశించింది. కాగా జడ్జి ఉత్తమ్ కుమార్ ను హత్యకు సంబంధించి సమాచారం ఇస్తే రూ.5లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటించింది.