UP Election : యూపీ ఎన్నికల్లో పోటీపై స్పందిచిన ప్రియాంక గాంధీ

వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే

UP Election : యూపీ ఎన్నికల్లో పోటీపై స్పందిచిన ప్రియాంక గాంధీ

Up (2)

UP Election వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే..2022 యూపీ ఎన్నికల బరిలోకి ప్రియాంకగాంధీ దిగే అవకాశం లేకపోలేదని సృష్టమవుతోంది.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రియాంకగాంధీ మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ..పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబానికి కంచు కోటగా ఉన్న రాయ్‌బరేలి స్థానం నుంచి పోటీ చేస్తున్నారా అని ప్రియాంక గాంధీని మీడియా ప్రశ్నించగా…ఎన్నికల్లో పోటీ అనేది అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. పోటీ చేస్తానో లేదో చెప్పలేను. ఎన్నికల్లో పోటీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని సమాధానమిచ్చారు.

అయితే మీడియా ఇదే విషయాన్ని పదే పదే అడగడంతో.. మీరు నా నుంచి ఏదో రాబట్టాలని చూసి లాభం లేదు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుందంటూ ప్రియాంక గాంధీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే యూపీ ఎన్నికల్లో పోటీని ప్రియాంకగాంధీ కొట్టిపారేకపోవడంతో..ఆమె యూపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదని సృష్టమవుతోంది.

ALSO READ Priyanka Gandhi Vadra : కాంగ్రెస్ కీలక నిర్ణయం..యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు