CM Yogi Adityanath: మూడు రోజుల్లో చంపేస్తాం.. యూపీ సీఎం ఆధిత్యనాథ్‌కు బెదిరింపులు

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను చంపేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్‌లైన్ వాట్సాప్‌లో బెదిరింపులు వచ్చాయి.

CM Yogi Adityanath: మూడు రోజుల్లో చంపేస్తాం.. యూపీ సీఎం ఆధిత్యనాథ్‌కు బెదిరింపులు

UP CM Yogi

CM Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను చంపేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్‌లైన్ వాట్సాప్‌లో బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ వ్యక్తి యూపీ సీఎంను మూడు రోజుల్లో చంపేస్తామంటూ, బాంబు దాడులు చేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ కు ఆగస్టు 2వ తేదీన మెస్సేను పంపించాడు. ఆ సందేశం వచ్చిన వెంటనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మేసేజ్ ఆధారంగా హెల్ప్ లైన్ ఆపరేషన్ కమాండర్ కేసును ఫైల్ చేశాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి అతన్ని అరెస్టు చేసేందుకు గాలింపు ప్రారంభించారు.

Bhagavad Gita Lessons in School బెంగాల్‌లో అధికారం ఇవ్వండి..స్కూల్లో భగవద్గీతను పాఠాలుగా చెప్పిస్తాం : బీజేపీ నేత

నిందితులను కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని లక్నో పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగుతున్న వేళ యూపీ సీఎంకు బాంబు బెదిరింపు రావటంతో యూపీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. యోగి ఆధిత్యనాథ్ ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతగా పేరొందాడు. తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. గతంలో కూడా యోగి ఆధిత్య నాథ్ కు అనేక హత్య బెదిరింపులు వచ్చాయి.