Mask In Car: మాస్క్ లేదని ప్రశ్నిస్తే.. ‘భర్తను ముద్దు పెట్టుకుంటా ఆపగలవా’ అని పోలీసుకు సమాధానమిచ్చిన మహిళ

నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో..

Mask In Car: మాస్క్ లేదని ప్రశ్నిస్తే.. ‘భర్తను ముద్దు పెట్టుకుంటా ఆపగలవా’ అని పోలీసుకు సమాధానమిచ్చిన మహిళ

Mask In Car

Mask In Car: ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ సమయంలో పబ్లిక్ అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు ఉన్నాయి. అయితే ఓ జంట కార్ తో చక్కర్లు కొడుతూ కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడమే కాకుండా అడిగిన పోలీసులకు వింత సమాధానమిచ్చింది. కారులో ఉండి కూడా మాస్క్ ధరించాలని, కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్నందుకు ఆ పాస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ‘నా కారు ఎందుకు ఆపావు. నా భార్యతో పాటు కారులో ఉన్నా’ అని ఓ వ్యక్తి మాస్క్ లేకుండానే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రీసెంట్ గా హై కోర్టు కారులో ఒక్కరున్నా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని ఆదేశాలిచ్చిందని గుర్తు చేసినా వారిద్దరూ వాదిస్తూనే ఉన్నారు. దమ్ముంటే వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ సవాల్ కూడా విసిరారు. కాసేపటికి మహిళా పోలీసులు వచ్చి ఆమెను దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

కొద్ది రోజులుగా ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశ రాజధానిలో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం సీఎం కేజ్రీవాల్ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వీకెండ్ లాక్ డౌన్ ను తీసుకొచ్చారు. శనివారం, ఆదివారం కొవిడ్ రూల్ ఉల్లంఘించినందుకు గానూ 569ఎఫ్ఐఆర్ లు, 2వేల 369చలాన్లు విధించారు ఢిల్లీ పోలీసులు. 323మంది అరెస్టు చేశారు కూడా.