Uma Bharti: సొంత పార్టీకే ధమ్కీ.. లిక్కరు షాపుల్లో గోషాలలు ఏర్పాటు చేస్తానంటున్న ఉమా భారతి

రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించింది. అనంతరం, కొన్ని నిరసనలు, దాడులు అంటూ ఆ యేడాది ముగిసింది. తాజాగా జనవరి 15 వరకు గడువు విధించారు. ఈసారి కూడా ప్రభుత్వం పట్టించుకున్న మానాన పోలేదు

Uma Bharti: సొంత పార్టీకే ధమ్కీ.. లిక్కరు షాపుల్లో గోషాలలు ఏర్పాటు చేస్తానంటున్న ఉమా భారతి

Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా మరో ధమ్కీ ఇచ్చారు. రాష్ట్రంలో లిక్కర్ దుకాణాల్ని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకోకపోవడంతో పలుమార్లు తనదైన రీతిలో స్పందించిన ఆమె.. ఇక ఎదురు చూపులు ముగిసిపోయాయని, లిక్కరు షాపుల్లో గోషాలలు ఏర్పాటు చేస్తానని ప్రకటించేశారు. ‘మధుశాల నుంచి గోశాల’ అంటూ బుధవారం ఆమె మీడియాతో చెప్పారు.

Union Budget 2023 Updates : మొబైల్ ఫోన్లు, టీవీలు కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు.. పూర్తి వివరాలు మీకోసం..!

శనివారం మధ్యాహ్నం, రాష్ట్ర రాజధానిలోని అయోధ్య నగర్ ట్రైసెక్షన్‌లోని మద్యం దుకాణానికి సమీపంలో ఉన్న ఆలయానికి ఉమా భారతి చేరుకున్నారు. మద్యంపై కొత్త పాలసీని ప్రకటించాలని, జనవరి 31 వరకు తాను అక్కడే ఉంటారని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఆమె డిమాండును పట్టించుకోకపోవడంతో నాలుగు రోజుల నిరీక్షణను ముగించుకున్న అనంతరం.. ఇక మద్యం షాపులపై దాడి చేయడమేనని ఆమె ప్రకటించారు.

Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ ఉమాభారతి గతంలో శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఉమాభారతి మండిపడ్డారు. మద్యాన్ని నిషేధించటమే కాదు రాష్ట్రంలో మద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించడంపై ఉమాభారతి ఆగ్రహం వ్యక్తంచేస్తూ నేరుగా మద్యం షాపులోకి వెళ్లి రాయితో సీసాలను పగులగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Budget2023: కేంద్ర బడ్జెట్-2023లోని 7 లక్ష్యాలు.. సప్తర్షిగా వర్ణించిన ఆర్థికమంత్రి నిర్మల

రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించింది. అనంతరం, కొన్ని నిరసనలు, దాడులు అంటూ ఆ యేడాది ముగిసింది. తాజాగా జనవరి 15 వరకు గడువు విధించారు. ఈసారి కూడా ప్రభుత్వం పట్టించుకున్న మానాన పోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఉమాభారతి ఇలా స్వయంగా ఆమే రంగంలోకి దిగి మద్యం షాపుపైకి రాళ్లు విసిరారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని హెచ్చరించారు.

#UnionBudget 2023 : బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది..ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటించాం : ప్రధాని మోడీ

ఉమాభారతి డిమాండ్ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పైగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం మద్యంపై 10 నుంచి 13 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతోపాటు మద్యం ధరలను మరింత తగ్గించనున్నట్లు ప్రభత్వం తెలిపింది. దేశీయ, విదేశీ లిక్కర్‌ను విక్రయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్న దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఇంట్లో లిక్కర్‌ను నిల్వచేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వార్షిక ఆదాయం రూ.కోటికి మించి ఉంటే ఇంటి వద్దే షాప్ ప్రారంభించుకోవచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.