Prashant Kishor : కాంగ్రెస్‌‌లోకి ప్రశాంత్ కిశోర్ ?

రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరుగడించిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారని తెలుస్తోంది.

Prashant Kishor : కాంగ్రెస్‌‌లోకి ప్రశాంత్ కిశోర్ ?

Rahul Gandhi

Prashant Kishor Join Congress? : రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరుగడించిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారని తెలుస్తోంది. పీకే విషయంలో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సోనియా, రాహుల్, ప్రియాంకలతో పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : Gold Rate : మరోసారి పెరిగిన బంగారం ధర

ఎన్నికల వ్యూహాలు, సమన్వయం, నిర్వహణ, పొత్తులపై తనకు ముఖ్యమైన పాత్ర ఉండాలని పీకే అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పునరుద్ధరణ, 2024 ఎన్నికలు ఎదుర్కోవడంపై ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ ప్లాన్ తయారు చేశారు. ఈ ప్లాన్ ను రాహుల్ కు అందచేశారు. ఈ ప్లాన్ పై ఇప్పటికే సీనియర్లతో రాహుల్ చర్చలు జరిపారు కూడా.

Read More : Olympic : క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత హాకీ టీం

సార్వత్రిక ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దేశ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వరుస సమావేశాలు, కీలక నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించే పరిణామాలు రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. దెబ్బల మీద దెబ్బలు పడుతున్న కాంగ్రెస్ మళ్లీ పూర్వస్థితికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read More : Indian Railways New Rules : ఆన్‌లైన్ రైలు టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్.. ప్రయాణికులు ఇక వెరిఫై చేసుకోవాల్సిందే!

అందులో భాగంగా గాంధీ కుటుంబంతో పీకే భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. జాతీయ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. అతను బాధ్యత తీసుకుంటే..చాలు..అధికారం, అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో..టార్గెట్ 2024గా పనిచేస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుపుతున్నారు పీకే. వాళ్లు కూడా ఒక భేటీ జరిపారు.

Read More :Tokyo Olympics : బిగ్ బ్రేకింగ్, సెమీస్‌‌కు చేరుకున్న బాక్సర్ లవ్లీనా..భారత్‌‌కు మరో పతకం ఖాయం

వీరంతా ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో పని చేస్తున్నారు. ఈ సమయంలో..గాంధీ ఫ్యామిలీతో ఈయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరికపై ఆయన స్పష్టమైన నిర్ణయం చెప్పకపోయినా..నో మాత్రం చెప్పలేదు. ఒకవేళ కాంగ్రెస్ లో వస్తే..సరైన గుర్తింపు, హోదా ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీనిచ్చినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈయన పని చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి పీకే కాంగ్రెస్ లో చేరుతారా ? చేరితో ఆయన ప్లాన్ వర్కవుట్ అవుతుంద ? లేదా అనేది చూడాలి.