EWS Quota : నీట్- పీజీ కౌన్సెలింగ్ వాయిదా..ఈడబ్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై కేంద్రం పునఃసమీక్ష

  నీట్​ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని

EWS Quota : నీట్- పీజీ కౌన్సెలింగ్ వాయిదా..ఈడబ్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై కేంద్రం పునఃసమీక్ష

Sc (1)

EWS Quota  నీట్​ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా బలహీన వర్గాల(EWS) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

నీట్ ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థుల వార్షికాదాయం క్రైటీరియాను నిర్ణయించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు వారాల సమయం అవసరమని చెప్పారు.

ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ గుర్తింపుపై ప్యానెల్ నివేదిక వచ్చే వరకు నాలుగు వారాలపాటు నీట్​ కౌన్సిలింగ్​ను వాయిదా వేస్తామని జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ సూర్యకాంత్​, జస్టిస్​ విక్రమ్​నాథ్​ కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీంతో నీట్-పీజీ కోర్సుల్లో EWS/OBC కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జనవరి 6కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ALSO READ CM Jagan : వైద్య రంగంలో 60వేల పోస్టులు భర్తీ, సీఎం జగన్ కీలక ప్రకటన