Rajasthan Politics : హస్తినలో సచిన్ పైలెట్, బీజేపీలోకి జంప్ ?

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచాక ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సచిన్‌ పైలట్. కానీ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌కు ఛాన్స్ ఇచ్చింది అధినాయకత్వం. సచిన్‌కు డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టింది. అయితే తన వర్గానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ గతేడాది ఒకసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు సచిన్ పైలెట్‌.

Rajasthan Politics : హస్తినలో సచిన్ పైలెట్, బీజేపీలోకి జంప్ ?

Sachin

Sachin Pilot : దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు బీజేపీకి జంప్ అవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేత జితిన్‌ ప్రసాద బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. జితిన్..రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా పేరు ఉంది. ఇదిలా ఉండగా..రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే..ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పాటు హస్తినంలో మకాం వేయనున్నారు. జితిన్ బీజేపీలోకి చేరడంతో..సచిన్ కూడా ఆ దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచాక ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సచిన్‌ పైలెట్. కానీ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌కు ఛాన్స్ ఇచ్చింది అధినాయకత్వం. సచిన్‌కు డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టింది. అయితే తన వర్గానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ గతేడాది ఒకసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు సచిన్ పైలెట్‌. తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగి పార్టీలో పరిస్థితులను చక్కదిద్దింది.

ఆ తర్వాత సచిన్‌ పైలెట్ కాంగ్రెస్‌లోనే కొనసాగినా.. డిప్యుటీ సీఎం పదవిని పోగొట్టుకున్నారు. అప్పట్నుంచి మరింత అసంతృప్తితో రగిలిపోతున్న సచిన్‌.. ఇప్పుడు మరోసారి పక్కా వ్యూహంతో తిరుగుబావుటా ఎగురవేశారని టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. మరి ఆయన బీజేపీకి జై కొడుతారా ? లేక కాంగ్రెస్ లోనే ఉంటారా ? అనేది తెలుసుకోవాలంటే..కొద్ది రోజుల పాటు వెయిట్ చెయ్యక తప్పదు.

Read More : Vaishnav Tej : వైష్ణవ్ తేజ్ ప్రేమిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?